టీ ఆల్‌మేవా రాష్ట్రకార్యవర్గం ఎన్నిక
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ ఆల్ మైనారిటీ ఎంప్లాయూస్ అండర్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హన్మకొండ రాయపురలోని ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏకగ్రీవంగా జరిగాయి. గౌరవ చైర్మన్‌గా ఎండీ.అబ్దుల్‌రషీద్, అధ్యక్షుడిగా ఆదిల్షరీఫ్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఖాజాఅజమొద్దీన్, ఉపాధ్యక్షులుగా అహ్మదుల్లాఖాన్, మొహసీన్, ఎండీ.గౌసిÄñæ¬ద్దీన్, ప్రధా న కార్యదర్శిగా ముజాహుద్దీన్, జహంగీర్‌బాబా, కోశాధికారిగా ఖాజాజుబేర్ సంయుక్త కార్యదర్శులుగా హఫీజ్‌ఖాన్, అజ్గర్ఖాన్ ఐటీ సెక్రటరీ ఆజం, ఖాజా జమీరొద్దీన్, ఫిరోజ్ మహిళా కార్యదర్శిగా రజీయ సుల్తానాలు ఎన్నికైనట్లు ఎండీ అబ్దుల్‌రషీద్ తెలిపారు. గత కార్యవర్గం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.