'తలసాని రాజీనామాపై స్పీకర్ స్పందించారు'
హైదరాబాద్ : తలసాని శ్రీనివాస యాదవ్ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా వెంటనే ఆమోదించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కి కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లో స్పీకర్ ఎస్ మధుసూదనచారితో కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, డీకే అరుణ, సంపత్‌కుమార్‌లు భేటీ అయ్యారు. అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.
తలసాని రాజీనామాను పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వరంగల్ ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేస్తే స్పీకర్ వెంటనే ఆమోదించిన సంగతి ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి గుర్తు చేశారు. తక్షణమే మంత్రి తలసానిపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు.