శబరిమలైకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
=బస్సుల అద్దెరేట్లు తగ్గించిన ఆర్టీసీ
=భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు
=ఇన్ చార్జి ఆర్ఎం చెంగల్‌రెడ్డి వెల్లడి
తిరుపతికార్పొరేషన్, న్యూస్‌లైన్ : శబరిమలైకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిం ది. వీటి అద్దెరేట్లను భక్తుల కోసం భారీగా తగ్గించింది. కిలో మీటరుకు 5 రూపాయల వరకు తగ్గిస్తూ ప్రత్యేక ప్యాకేజీలను అందించింది. ఆ వివరాలను శనివారం ఏపీఎస్ ఆర్టీసీ ఇన్చార్జి ఆర్ఎం టీ.చెంగల్‌రెడ్డి వెల్లడించారు. గత ఏడాది 300 బస్సులు శబరిమలైకు నడిపి అయ్యప్పస్వామి భక్తులకు సేవలందిం చినట్టు తెలిపారు. ఈ ఏడాది భక్తులకు ఎలాం టి అసౌకర్యాలు లేకుండా అవసరాన్ని బట్టి బస్సులు నడుపుతామన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ
శబరిమలైకు బస్సు బుక్ చేస్తే ఆ బృందంలోని గురుస్వాములకు, ఇద్దరు వంటవారికి, ఇద్దరు మణికంఠ స్వాములకు (పది సంవత్సరాల లో పు), లగేజీ బాయ్‌కి ఉచిత ప్రయాణం ఉం టుందన్నారు. అంతర్రాష్ట్ర పన్నులు భక్తులపై ఉండవని తెలిపారు. భక్తులు కోరిన మార్గాల్లో బస్సులు నడుపుతామని చెప్పారు. వీడియోకోచ్ సౌకర్యం గల కండిషన్లో ఉన్న బస్సులను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. గురుస్వాములకు బస్సుల బుకింగ్‌పై రోజుకు 300 రూపాయల ఆకర్షణీయమైన కమీషన్ ఇస్తామని తెలిపారు.