మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురికి అస్వస్థత
ఏలూరు(టి.నర్సాపురం): మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని టి.నర్సాపురం మండలం జెగ్గవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు వాంతులు, విరోచనాలు వికారం వంటి లక్షణాలు కనిపించాయి. దాంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మధ్యాహ్న భోజనం వికటించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.