T20 Mumbai League
-
టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ విధ్వంసం!
టీ20 ముంబై లీగ్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ విజృంభించాడు. టోర్నీలో ఏఆర్సీఎస్ అంధేరీ తరఫున ఆడుతున్న అర్జున్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. మొదట బౌలింగ్‌లో మూడు వికెట్లు (3-1-11-3) కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన అర్జున్ టెండూల్కర్ 34 బంతుల్లోనే 66 పరుగులు అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో వన్‌మ్యాన్ షో ప్రదర్శన చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్‌ను అందుకున్న అర్జున్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ముషీర్‌ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ అర్జున్ టెండూల్కర్ ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. ఓమ్ కేశ్‌కామత్ (36 బంతుల్లో 49) టాప్ స్కోరర్ కాగా, సాగర్ ఛాబ్రియా (23 బంతుల్లో 44) రాణించాడు. అర్జున్ మూడు వికెట్లు తీయగా, ప్రసూన్ సింగ్ 2, అజమ్ మిశ్రా, శివమ్ దూబే, ముషీర్ ఖాన్, ప్రగ్నేశ్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆడింది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ, తన ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసిన అర్జున్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.Arjun Tendulkar picked up a wicket in his very first over, but the funniest part was Musheer Khan going in for the high-five 😭 Arjun hit his hand so hard Musheer was genuinely shocked and started telling everyone on the field to look at how hard he got hit 😂💀 pic.twitter.com/ldx9GCD2po— OldMonkOfCricket (@OldMonkofCric) June 9, 2026Match 16 | AA v BB: A performance to remember! Arjun Tendulkar bags the Player of the Match honours.📌 June 1-13 | Wankhede Stadium.🎟️ Tickets live at the link in bio. 🎥 Watch live on Jio Hotstar and Star Sports.🌐 Track live on https://t.co/2GVUXSuuuk and the T20 Mumbai… pic.twitter.com/2C4JBSxKVw— T20 Mumbai (@T20Mumbai) June 8, 2026Arjun Tendulkar hit such a massive six in today’s T20 Mumbai League match that the ball landed in the stands and struck a young child. The child appeared to be in a lot of pain and started crying loudly.😢 pic.twitter.com/yJIyGc3Oit— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2026 -
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
కెప్టెన్సీతో పాటు టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌లో కసి రగులుతోన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ముంబై లీగ్‌లో అతడు వరుస విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 24 బంతుల్లో 48 పరుగులు చేసిన స్కై.. తాజాగా తానాడిన రెండో మ్యాచ్‌లో (మరాఠా రాయల్స్) మరింతగా చెలరేగిపోయి 36 బంతుల్లోనే అజేయమైన 72 పరుగులు చేసి తన జట్టును గెలుపు తీరాలు దాటించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డును స్కై.. ఇదే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన సహచరుడు సిల్వెస్టర్ డిసౌజాతో షేర్ చేసుకొని తన గొప్ప మనసును చాటుకున్నాడు.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సిల్వెస్టర్ డిసౌజా (3.5-0-21-5) ధాటికి 152 పరుగులకే ఆలౌటైంది. రాయల్స్ జట్టులో 36 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. చిన్మయ్ రాజేశ్ సుతార్ (32 రిటైర్డ్ ఔట్), సాహిల్ జాదవ్ (15), కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (24), అయాజ్ ఖాన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రంప్స్ నైట్స్ జట్టు.. సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ద సెంచరీతో పాటు నూతన్ కుమార్ గోయెల్ (56) అర్ద సెంచరీతో రాణించడంతో 16 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.కాగా, త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను తాజాగా ప్రకటించారు. ఫామ్ కోల్పోయిన కారణంగా భారత సెలెక్టర్లు సూర్యను జట్టును తప్పించి, కెప్టెన్సీ నుంచి తొలగించారు. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. -
కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన శ్రేయస్ అయ్యర్ టీ20 ముంబై లీగ్‌లో తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. మొదట మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఆ తర్వాత కెప్టెన్‌గా తన జట్టును గెలిపించడమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా శనివారం సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నూతన్ కుమార్ (34) పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు. మొత్తం మీద టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికైన రోజునే ముంబై టీ20లీగ్‌లోనూ శ్రేయస్ విజృంభించడం చూస్తుంటే కెప్టెన్సీ ఇచ్చిన ఆనందం రెట్టింపు అయింది. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ సూర్యకుమార్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అయ్యర్‌కు అప్పగించింది.ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన మూడు వేర్వేరు జట్లకు అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా మూడు జట్లలో చోటు సంపాదించి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026 View this post on Instagram A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)చదవండి: సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన! -
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను ఇవాళ (జూన్ 6) తొలగించారు. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతడికి ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరును ప్రకటించారు.త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేశారు. ఈ మూడు జట్లలో స్కైకు చోటు లభించలేదు. తనపై వేటు పడిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించి, కొత్తగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై.. వేటు పడిన గంటల వ్యవధిలో బ్యాట్‌తో ఫైరయ్యాడు. టీ20 ముంబై లీగ్‌లో భాగంగా సోబో ముంబై ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రాత్రి) 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి (ట్రయంప్ నైట్స్ ఎంఎన్ఈ కెప్టెన్‌గా) వీరంగం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్కై ప్రత్యర్ది జట్టులో కొత్తగా ఎంపికై భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండటం మరో విశేషం. మ్యాచ్‌కు ముందు స్కై శ్రేయస్‌ను హత్తుకొని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చూడచక్కని దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.ముంబై టీ20 లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. సూర్య ఔటయ్యాక అతడి జట్టు గాడి తప్పింది. 19 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. స్కై క్రీజ్‌లో ఉన్నంతసేపు అతడి జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్ కూడా చేసేలా కనిపించడం లేదు. ప్రత్యర్ది జట్టు బౌలర్లలో ప్రథమేశ్ డాకే 3, యశ్ డిచోల్కర్ 2, సిద్దార్థ్ రౌత్, వేదాంత్ గోరే తలో వికెట్ తీసి స్కై జట్టును దెబ్బకొట్టారు. స్కై జట్టులో అతడితో పాటు అఖిల్ హెర్వాద్కర్ (12), నూతన్ కుమార్ గోయెల్ (34), మకరంద్ గిరీశ్ పాటిల్ (11) మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో..
ముంబై టీ20 లీగ్‌లో బుధవారం రెండు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. వాంఖడే వేదికగా మధ్యాహ్నం మ్యాచ్‌లో బాంద్రా బ్లాస్టర్స్- నార్త్ ముంబై పాంథర్స్ జట్లు తలపడ్డాయి.‘సూపర్’ విజయంఈ మ్యాచ్‌లో బాంద్రా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. నార్త్ ముంబై సైతం 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి సరిగ్గా 228 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. నార్త్ ముంబై గెలుపు జెండా ఎగురవేసింది.172 పరుగులుఇక సాయంత్రం మ్యాచ్‌లో ఆకాశ్ టైగర్స్- ఈగల్ థానే స్ట్రైకర్స్ పోటీపడ్డాయి. వాంఖడే మైదానంలో టాస్ గెలిచిన ఈగల్ థానే కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆకాశ్ టైగర్స్... 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.ఓపెనర్లలో జై గోకుల్ బిస్తా అర్ధ శతకం (56)తో రాణించగా.. కెప్టెన్ షామ్స్ ములానీ 22 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో సఖామ్ పరాషర్, సౌరభ్ సింగ్ చెరో 30 పరుగులు చేశారు. ఈగల్ ఠానే బౌలర్లలో ఓంకార్ తర్మాలే మూడు వికెట్లతో సత్తా చాటగా.. అథర్వ ఆంకోలేకర్, సాయిరాజ్ పాటిల్, కార్తిక్ మిశ్రా, అమర్త్య రాజే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఈగల్ థానేకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్ శశ్వత్ జగ్తాప్ 2 పరుగులకే నిష్క్రమించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఏక్నాథ్ కేర్కార్ 3 పరుగులు చేసి అవుటయ్యాడు. మరో ఓపెనర్ సుమేర్ జవేరి 26 పరుగులు చేయగా.. సాయిరాజ్ పాటిల్ 39, వినయ్ కన్వార్ 24 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.మెరుపు ఇన్నింగ్స్‌మిగిలిన వారిలో సిద్ధాంత్ సింగ్ (19 బంతుల్లో 37).. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (15 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయం దిశగా నడిపించారు. ఆఖరి ఓవర్ ఐదో బంతి నో బాల్ అయింది. అప్పటికి ఈగల్ థానే విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఓంకార్ థర్మాలే సింగిల్ తీశాడు.ఆఖరి బంతికి రనౌట్అయితే ఆఖరి బంతికి అమర్త్య రాజే రనౌట్ కావడంతో ఈగల్ థానే కథ ముగిసింది. ఆకాశ్ టైగర్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. ఇక మూడు వికెట్లతో చెలరేగి ఈగల్ థానే పతనాన్ని శాసించిన శశాంక్ అట్రాడేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.కాగా జూన్ 1 నుంచి మొదలైన ముంబై టీ20 లీగ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉండగా.. ఆకాశ్ టైగర్స్‌కు రెండింట తొలి విజయం.చదవండి: సూర్యకుమార్‌కు భారీ షాక్! -
ఉత్కంఠ పోరు.. 'రహానే' జట్టు సూపర్ విజయం
టీ20 ముంబై లీగ్ 2026లో ఇవాళ (జూన్ 3) ఓ ఆసక్తికర సమరం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో నార్త్ ముంబై పాంథర్స్, బాంద్రా బ్లాస్టర్స్ జట్లు తలపడగా.. అజింక్య రహానే నేతృత్వం వహిస్తున్న ముంబై పాంథర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. సూపర్ ఓవర్లో ముంబై పాంథర్స్ పైచేయి సాధించింది.నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్.. కెప్టెన్ సువేద్ పార్కర్ (110) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పాంథర్స్ టీమ్.. బ్లాస్టర్స్‌కు ధీటుగా పోరాడి స్కోర్‌ను సమం చేసింది. 16 ఓవర్ల వరకు ఓటమి ఖాయమనుకున్న పాంథర్స్ అనూహ్యంగా పుంజుకొని చివరి 4 ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి స్కోర్‌ను సమం చేసింది. వైభవ్ మాలి (32), రాహుల్ సావంత్ (10), తనుశ్ కోటియన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తనుశ్ చివరి ఓవర్లో బౌండరీ, సిక్సర్ సహా చివరి బంతికి రెండు పరుగులు సాధించి మ్యాచ్ టై కావడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సూపర్ ఓవర్లో వైభవ్ మాలి మరోసారి రెచ్చిపోవడంతో (2 సిక్సర్లు, ఫోర్) తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ 6 బంతుల్లో 20 పరుగులు చేసింది. ఛేదనలో మోహిత్ అవస్థి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బ్లాస్టర్స్ జట్టు 7 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. కాగా, ఈ టోర్నీలో రహానే, శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ లాంటి ఐపీఎల్ స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
శ్రేయస్ అయ్యర్ విఫలం.. ఘోర పరాజయం
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే శ్రేయస్ అయ్యర్ మరో టీ20 లీగ్ బరిలో దిగాడు. ముంబై టీ20 లీగ్‌లో SoBo ముంబై ఫాల్కన్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, స్థానిక లీగ్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవం ఎదురైంది.కాగా ఐపీఎల్లో గతేడాది పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. పదిహేడు మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే..ఇక ఇదే జోరును కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ పంజాబ్ ఆరంభంలో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే, ఆ తర్వాత అంతా తలకిందులైపోయింది. వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న శ్రేయస్ సేన.. రాజస్తాన్ రాయల్స్‌తో పోటీలో వెనుకబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో శ్రేయస్ అయ్యర్.. పద్నాలుగు మ్యాచ్‌లు ఆడి 498 పరుగులు చేయగలిగాడు. ఇందులో ఓ అజేయ శతకం (101) కూడా ఉంది. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే ముంబై టీ20 లీగ్‌లో బ్యాట్ ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు శ్రేయస్.శ్రేయస్ అయ్యర్ విఫలం శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న SoBo ముంబై ఫాల్కన్స్ మంగళవారం ARCS అంధేరి జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అంధేరి కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.ఘోర పరాజయంఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఫాల్కన్స్‌ను 126 పరుగులకే పరిమితం చేసిన అంధేరి జట్టు.. ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు తీయడంతో పాటు.. 16 పరుగులు చేసిన శివం దూబే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కాగా జూన్ 1 నుంచి 13 వరకు ముంబై టీ20 లీగ్ తాజా ఎడిషన్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఈ లీగ్‌లో బాంద్రా బ్లాస్టర్స్, ఈగల్ థానే స్ట్రైకర్స్, ఆకాశ్ టైగర్స్ MWS, MSC మరాఠా రాయల్స్, నార్త్ ముంబై పాంథర్స్, ట్రిపుంహ్స్ నైట్స్ MNE, SoBo ముంబై ఫాల్కన్స్, ARCS అంధేరి జట్లు పాల్గొంటున్నాయి.ఈ లీగ్‌లో టీమిండియా స్టార్లు, ముంబైకర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్, తుషార్ దేశ్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ తదితరులు పాల్గొంటున్నారు. వెటరన్ స్టార్ అజింక్య రహానే కూడా ఈ లీగ్‌లో భాగమయ్యాడు.చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ!Dube get a wicket of shreyas iyer 😭😭😭😭 pic.twitter.com/xk5DSo1wdf— sabas csk (@saba9361) June 2, 2026 -
ఐపీఎల్ తర్వాత కూడా 'స్కై' వైఫల్యాలు కొనసాగింపు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యాల పరంపర ఐపీఎల్ 2026 తర్వాత కూడా కొనసాగుతోంది. క్యాష్ రిచ్ లీగ్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ చేతులెత్తేశాడు. ముంబై టీ20 లీగ్‌లో ట్రయంప్స్ నైట్స్ ఎంఎన్‌ఈకి ఆడుతున్న స్కై.. నార్త్ ముంబై పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతుల్లో 19 పరుగులు (4 ఫోర్లు) మాత్రమే చేసి ఔటయ్యాడు.తాజా వైఫల్యం తర్వాత స్కై టీమిండియా భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కైను భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, జట్టు నుంచి కూడా తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ సైతం స్కైకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.స్కై గతకొంతకాలంగా టీ20 ఫార్మాట్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2026 అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. అంతకుముందు టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా పసికూన యూఎస్ఏపై.ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో స్కైకు వ్యతిరేకులు ఎక్కువయ్యారు. తాజా వైఫల్యం తర్వాత సోషల్ మీడియాలో అభిమానుల స్పందనలు వైరల్‌గా మారాయి. కొందరు అతడికి మద్దతుగా నిలబడుతుంటే.. మరికొందరు వ్యతిరేకంగా భారీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.ముంబై టీ20 లీగ్‌లో స్కై వైఫల్యం అతడి జట్టు కొంప ముంచింది. కీలక దశలో ఔట్ కావడంతో అతడి జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కై ప్రత్యర్ది జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్కై జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమై, 21 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై టీ20 లీగ్‌లో స్కైతో పాటు చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్ టెండుల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ‘భారీ’ ధరకు అమ్ముడుపోయాడు. టీ20 ముంబై లీగ్ తాజా వేలంలో ARCS అంధేరి ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసింది. కనీస ధర కంటే అతడి కోసం ఫ్రాంఛైజీ ఏకంగా 400 శాతం ఎక్కువగా ఖర్చు చేయడం గమనార్హం.ఐపీఎల్లో ముంబై నుంచి లక్నోకుకాగా ఆటలో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోతున్నాడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar). ఇప్పటికీ క్రికెటర్‌గా అతడికి పూర్తి స్థాయి గుర్తింపులేదు. దేశీ క్రికెట్లో కొన్నాళ్లు సొంత జట్టు ముంబైకి ఆడిన అర్జున్.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినా ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు పెద్దగా గుర్తింపు రావడం లేదు.బెంచ్‌కే పరిమితంఇక ఐపీఎల్లో చాలా కాలం ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు అర్జున్. ఈ జట్టుకు సచిన్ మెంటార్‌గా ఉండగా.. అర్జున్ను కనీస ధర రూ. 30 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఇటీవలే అతడిని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. అయితే, లక్నో తుదిజట్టులోనూ అతడికి స్థానం దక్కడం లేదు. దీంతో బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి.ధర ఎంతంటే?ఇలాంటి తరుణంలో తొలిసారి టీ20 ముంబై లీగ్‌లో ఆడేందుకు అర్జున్ టెండుల్కర్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వేలంలో కనీస ధర రూ. 2 లక్షలతో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం నాటి వేలంలో అంధేరీ ఫ్రాంఛైజీ అర్జున్ కోసం పోటీపడింది. ఆఖరికి రూ. 10 లక్షల ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ జీతంలో ఇది దాదాపు 33 శాతం.కాగా టీమిండియా స్టార్, 2024, 2026 వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యుడైన శివం దూబే కూడా అంధేరీ జట్టుకే ఆడుతున్నాడు. అతడి ధర రూ. 20 లక్షలు. ఇక తాజా వేలంలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్‌ను అంధేరీ రూ. 11 లక్షలకు కొనుగోలు చేసింది.అనుమతి వచ్చిందిలా..ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)తో సంబంధం లేకున్నా.. ఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు అర్జున్ టెండుల్కర్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. స్వతహాగా ముంబైకర్ అయిన అర్జున్.. గతేడాది వేరే రాష్ట్ర టీ20 లీగ్‌లో ఆడనందున బీసీసీఐ నిబంధన ప్రకారం అతడు ముంబై టీ20 లీగ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది.కాగా ఐపీఎల్ కాకుండా కేవలం ఒకే ఒక్క స్థానిక లీగ్‌లో ఆడేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదలా ఉంటే.. జూన్ మొదటి వారంలో టీ20 ముంబై లీగ్ జరుగనున్నట్లు సమాచారం.👉టీ20 ముంబై లీగ్.. రిటైన్ ప్లేయర్ల జాబితా ప్రకటనచదవండి: ద్రవిడ్ ‘ది గ్రేట్’ అన్నాడు!.. పాక్ పేసర్‌కు షాకిచ్చిన పీసీబీ! -
అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌కు ఐపీఎల్లో ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. గతేడాది వరకు అతడు ముంబై ఇండియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున అర్జున్ కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.ఇక్కడా బెంచ్‌కే పరిమితంఅయితే, 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar)ను లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. కానీ.. ముంబై ఇండియన్స్ మాదిరే ఇక్కడ కూడా ఈ ఆల్‌రౌండర్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఈ సీజన్లో లక్నో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా.. అర్జున్‌కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు.అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయంఇక ఇప్పటికి ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా ఆరు ఓడి లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లక్నో జట్టులో ఆడే పరిస్థితి లేని తరుణంలో టీ20 ముంబై లీగ్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు జర్నలిస్టు గౌరవ్ గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రూ. 5 లక్షల కనీస ధరతోకాగా మే 2న ముంబైలో టీ20 ముంబై లీగ్ వేలం జరుగనుంది. ఇందులో రూ. 5 లక్షల కనీస ధరతో అర్జున్ టెండుల్కర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర గల కేటగిరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ ఆల్‌రౌండర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.బీసీసీఐ అనుమతితోనే..అయినప్పటికీ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అర్జున్‌కు ఈ టీ20 లీగ్ వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. నిబంధనల ప్రకారం.. సంవత్సర కాలం పాటు కూలింగ్ పీరియడ్ పూర్తైన తర్వాత స్థానిక ఆటగాళ్లు ఈ లీగ్‌లో తిరిగి పాల్గొనవచ్చని తెలిపింది.ఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి ఉన్మేష్ ఖన్వీకర్ స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు (అర్జున్).. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అసోసియేషన్ తరఫున టీ20 లీగ్‌లో ఆడటం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్లు వేరే లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అలా అర్జున్ టెండుల్కర్, సిద్ధాంత్ అద్ధాత్‌రావు టీ20 ముంబై లీగ్ సీజన్-4లో ఆడేందుకు అనుమతి లభించింది’’ అని పేర్కొన్నాడు. చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు! -
రిటైన్ ప్లేయర్ల జాబితా ప్రకటన
ప్రతిష్టాత్మక టీ20 ముంబై లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన రిటైన్ ఆటగాళ్ల జాబితాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కూడా భారత స్టార్ క్రికెటర్లు లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ వంటి స్టార్లు తమ తమ ఫ్రాంచైజీలతో కొనసాగుతున్నారు.మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తలా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది.Triumph Knights Mumbai North East జట్టు సూర్యకుమార్ యాదవ్‌ను ఐకాన్ ప్లేయర్‌గా కొనసాగించింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే, సూర్యాంశ్ షెడ్గే కూడా జట్టులో నిలిచారు.గత సీజన్ రన్నరప్ SoBo Mumbai Falcons తమ ఐకాన్ ప్లేయర్‌గా శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. అంగ్క్రిష్ రఘువంశీ, హర్ష్ అఘవ్ కూడా జట్టులో కొనసాగుతున్నారు.డిఫెండింగ్ ఛాంపియన్ Mumbai South Central Maratha Royals తుషార్ దేశ్‌పాండేను ఐకాన్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. సిద్ధేశ్ లాడ్, రోహన్ రాజే కూడా కొనసాగనున్నారు.Bandra Blasters తరఫున యశస్వి జైస్వాల్ ఐకాన్ ప్లేయర్‌గా నిలిచాడు. సువేద్ పార్కర్, ధృమిల్ మట్కర్ జట్టులో కొనసాగుతున్నారు.ARCS Andheri శివమ్ దూబేను రిటైన్ చేయగా, ప్రగ్నేష్ కన్పిల్లేవార్, దీపక్ శెట్టి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.Aakash Tigers Mumbai Western Suburbs సర్ఫరాజ్ ఖాన్‌ను ఐకాన్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. షమ్స్ ములానీ, జే బిస్తా కూడా జట్టులో ఉన్నారు.North Mumbai Panthers అజింక్య రహానేను రిటైన్ చేసుకోగా, అభిజ్ఞాన్ కుందు, తనుష్ కోటియన్ జట్టులో కొనసాగుతున్నారు.Eagle Thane Strikers శార్దూల్ ఠాకూర్‌ను ఐకాన్ ప్లేయర్‌గా నిలబెట్టుకుంది. అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ కూడా జట్టులో ఉన్నారు.ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ, ఈ రిటెన్షన్లు లీగ్ స్థాయిని మరింత పెంచుతాయని అన్నారు. యువ ఆటగాళ్లకు స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభించడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.2018లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయికి వెళ్లే వేదికగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగనున్న వేలంపై ఉంది. -
శ్రేయస్ అయ్యర్‌కు మరో చేదు అనుభవం
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఒకే నెలలో వరుసగా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జూన్ 3న అతని సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. పది రోజులు తిరక్కుండానే జూన్ 12న అతని కెప్టెన్సీలోని మరో జట్టు ఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది.నిన్న జరిగిన ముంబై టీ20 లీగ్ ఫైనల్లో శ్రేయస్ నేతృత్వం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్.. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ప్రత్యర్ధి టీమ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్‌లో శ్రేయస్ ఆటగాడిగానూ విఫలమయ్యాడు. 17 బంతులు ఆడి బౌండరీలు, సిక్సర్లు లేకుండా 12 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టులో మయూరేశ్ తండేల్ (50) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. హర్ష్ గర్వ్ (28 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంగ్క్రిష్ రఘువంశీ 7, ఇషాన్ ముల్చందని 20, అమోఘ్ భత్కల్ 16 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో వైభవ్ మాలీ 2, ఆదిత్య ధుమాల్, మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ తలో వికెట్ పడగొట్టారు.రాయల్స్ ఇన్నింగ్స్‌లో చిన్మయ్ రాజేశ్ సుతార్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. అవైస్ ఖాన్ నౌషద్ 38, సాహిల్ భగవంతా జాదవ్ 22, సిద్దేశ్ లాడ్ 15, సచిన్ యాదవ్ 19, రోహన్ రాజే 8 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రేయస్ జట్టు బౌలర్లలో కార్తీక్ మిశ్రా, యశ్ దిచోల్కర్ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా చిన్మయ్ రాజేశ్ సుతార్ ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సాయిరాజ్ పాటిల్ గెలుచుకున్నాడు. కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు2024లో ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడుఐపీఎల్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్)ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్)ముంబై టీ20 లీగ్ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్) -
పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు తాను కెప్టెన్సీ వహించే జట్లను అలవోకగా ఫైనల్‌కు చేర్చడం అలవాటుగా మారింది. జూన్ 1న ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్.. పది రోజులు కూడా తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై టీ20 లీగ్ 2025లో నిన్న (జూన్ 10) జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రేయస్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.ఏడాది కాలంలో శ్రేయస్ తాను సారథ్యం వహించిన జట్లను ఫైనల్స్‌కు చేర్చడం ఇది నాలుగో సారి. 2024 ఐపీఎల్‌తో మొదలైన శ్రేయస్ కెప్టెన్సీ జైత్రయాత్ర ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్ వరకు కొనసాగింది. 2024 ఐపీఎల్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్.. ఆతర్వాత ముంబైకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్ తృటిలో టైటిల్ మిస్ కావడంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనే పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేర్చాడు.శ్రేయస్ తన జట్లను ఫైనల్స్‌కు చేర్చిన గత నాలుగు సందర్భాల్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సందర్భంలో 15 మ్యాచ్‌ల్లో 39 సగటున, 146.86 స్ట్రయిక్‌రేట్‌తో 2 హాఫ్ సెంచరీల సాయంతో 351 పరుగులు చేశాడు.అనంతరం ముంబైకు ముస్తాక్ అలీ ట్రోఫీ అందించిన సందర్భంలో 188.52 స్ట్రయిక్‌రేట్‌తో 345 పరుగులు సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో 175.07 స్ట్రయిక్‌రేట్‌తో 604 పరుగులు సాధించాడు. ముంబై టీ20 లీగ్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టిన శ్రేయస్ ఈ లీగ్‌లో ఫామ్‌ను ప్రదర్శించాల్సి ఉంది.చరిత్ర సృష్టించాడుతాజాగా ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడం ద్వారా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్ తన సారథ్యంలో 2019లో ఢిల్లీని, 2024లో కేకేఆర్‌ను, 2025లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు.ముంబై టీ20 లీగ్ సెమీఫైనల్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాస్టర్స్ 130 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రేయస్ జట్టు 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ వ్యక్తిగతంగా రాణించనప్పటికీ (1) తన జట్టును విజయవంతంగా ఫైనల్స్‌కు చేర్చాడు. రేపు జరుగబోయే ఫైనల్స్‌లో శ్రేయస్ జట్టు సిద్దేశ్ లాడ్ నేతృత్వంలోని ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. శ్రేయస్ ఈ టైటిల్‌ను కూడా సాధిస్తే కెప్టెన్‌గా అతనికి తిరుగే ఉండదు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. కేవలం 23 బంతుల్లోనే..!
ముంబై టీ20 లీగ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ ఆటగాడు పృథ్వీ షా ఇరగదీశాడు. లీగ్‌లో భాగంగా ట్రయంప్ నైట్స్‌తో నిన్న (జూన్ 8) జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో షా కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షా సునామీ హాఫ్ సెంచరీతో పాటు హర్షల్ జాదవ్ (30 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), గౌరవ్ జాథర్ (10 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, సిక్స్), రాహుల్ సావంత్ (9 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నైట్స్ బౌలర్లలో శ్రేయస్ గౌరవ్ 2, మినాద్ మంజ్రేకర్, పరిక్షిత్, సుర్యాంశ్ షేడ్గే తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్స్.. ప్రతిక్ మిశ్రా (3.5-0-30-4) రెచ్చిపోవడంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటై 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. పాంథర్స్ బౌలర్లలో రాహుల్ సావంత్ 2, ముజమ్మిల్ ఖాద్రి, గౌరవ్ జాథర్ తలో వికెట్ తీశారు. నైట్స్ ఇన్నింగ్స్‌లో సిద్దాంత్ ఆధత్రావ్ (76) ఒంటరిపోరాటం చేసి 45 బంతుల్లో 76 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), పరిక్షిత్ (20), శిఖర్ ఠాకూర్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా పాంథర్స్, నైట్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, పృథ్వీ షా ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించలేదు. ఈ సీజన్ మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత కొంతకాలంగా షా ఓవర్ వెయిట్ కారణంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ తన దేశవాలీ జట్టు ముంబైలో కూడా స్థానం కోల్పోయాడు. తాజా ప్రదర్శన తర్వాత షా తిరిగి ముంబై జట్టులో చోటు ఆశిస్తున్నాడు. 2024-25 సీజన్లో షా రెండు సార్లు ముంబై జట్టులో స్థానం కోల్పోయాడు. రంజీ జట్టుతో పాటు విజయ్ హజారే టీమ్ నుంచి డ్రాప్ అయ్యాడు. 2018లో టీమిండియా తరఫున ఘనంగా (తొలి టెస్ట్‌లోనే సెంచరీ) అరంగేట్రం చేసిన షా.. అతి కొద్ది కాలంలోనే ఫిట్నెస్ సమస్యలు, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా కనుమరుగయ్యాడు. షా చివరిగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. -
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025 తర్వాత తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. నిన్న (జూన్ 4) మొదలైన టీ20 ముంబై లీగ్‌లో ట్రయంప్ నైట్స్ ఫ్రాంచైజీకి సారథ్యం వహిస్తున్న స్కై.. ఈగల్ థానే స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన అర్ద సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో స్కై సత్తా చాటినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రయంప్ నైట్స్ ఓటమిపాలైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్స్.. స్కై రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నైట్స్ ఇన్నింగ్స్‌లో సురేంద్ర రాణా (53) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో పరిక్షిత్ 29, సంజయ్ జైన్ 24, సూర్యాంశ్ షేడ్గే 8, సిద్దాంత్ 4 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో అమిత్ పాండే, హర్ష్ తన్నా, శశాంక్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. సాయిరాజ్ పాటిల్ (22 బంతుల్లో 47 నాటౌట్), వరుణ్ లవండే (38 బంతుల్లో 57) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో అనిష్ ముకుంద్ (37) కూడా రాణించాడు. నైట్స్ బౌలర్లలో మినాద్ మంజ్రేకర్ 2,సూర్యకాంత్ పవార్, భరత్ పాటిల్, పరిక్షిత్ తలో వికెట్ తీశారు.కాగా, తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (ప్లేయర్ ఆఫ్ ద సిరీస్) గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో స్కై 16 మ్యాచ్‌ల్లో 65.18 సగటున 5 అర్ద సెంచరీల సాయంతో 717 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో స్కై ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో పరాజయాలు ఎదుర్కొన్నా, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకొని క్వాలిఫయర్-2 వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో ముంబై పంజాబ్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
ఫిక్సింగ్‌కు యత్నించిన గుర్మీత్ సింగ్ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. భమ్రా ముంబై టీ20 లీగ్‌లో సొబో సూపర్ సానిక్స్ అనే ఫ్రాంచైజీ కలిగి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం అతడు ఆ లీగ్‌లో ఫిక్సింగ్‌కు యత్నించినట్లు తేలడంతో బోర్డు అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా నిషేధం విధించారు. అయితే, భమ్రాపై ఐదేళ్లా లేదంటే జీవితకాల నిషేధమా అనేది తెలియాల్సి ఉంది. కాగా 2019 సీజన్లో సొబో సూపర్ సానిక్స్ ప్లేయర్లు ధవళ్ కులకర్ణి, భవిన్ ఠక్కర్‌లతో ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిపారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కులకర్ణి సహా ఠక్కర్‌లు ఫిక్సింగ్‌కు నిరాకరించారు. తదనంతరం ఈ విషయాన్ని బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు తెలిపారు. సోనూ వాసన్ అనే వ్యక్తి ద్వారా గుర్మీత్ సింగ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేశారు. సోనూ వాసన్ డబ్బు ఆశ చూపినా భవిన్ తలొగ్గలేదు. ఇద్దరు ఫిక్సింగ్‌కు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణలో గుర్మీత్ దోషి అని తేలడంతో శిక్ష ఖరారు చేశారు.ఇక భమ్రా జీటీ20 కెనడా లీగ్ (ప్రస్తుతం మనుగడలో లేదు)లోనూ భాగమయ్యాడు. కాగా కోవిడ్‌కు ముందు అతడు ముంబై టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్‌గా ఉండగా.. ప్రస్తుతం అతడిని లీగ్ నుంచి తొలగించారు.ఐపీఎల్‌లోనూ ఫిక్సింగ్ కలకలంకాగా ఐపీఎల్-2025లోనూ ఫిక్సింగ్‌కు అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బందికి కీలక సూచనలు చేసింది.హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త గట్టిగానే ఫిక్సింగ్ యత్నాలు చేస్తున్నాడని.. ఆ వ్యక్తి గనుక సంప్రదిస్తే వెంటనే అవినీతి నిరోధక భద్రతా విభాగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతుల పేరిట వల వేసే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ అతడు ఏ రకంగానైనా సంప్రదింపులు జరపాలని చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆటగాళ్లను అప్రమత్తం చేసింది.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా -
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆవిర్భావం తర్వాత దేశంలో ఎన్నో స్థానిక టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TPL), ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL), కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఇందులో భాగం.ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కూడా గత రెండు సీజన్లుగా టీ20 ముంబై లీగ్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మే 26- జూన్ 5 వరకు మూడో ఎడిషన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే, ఈ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు ఎంసీఏ మాస్టర్ ప్లాన్ వేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబైకి టీమిండియా స్టార్లందరినీ రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సహా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, శివం దూబే, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్ తదితరులకు టీ20 ముంబై లీగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా ఎంసీఏ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కాగా ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత టీమిండియా టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ టూర్‌కి ఎంపిక కాని ముంబై సభ్యులంతా స్థానిక టీ20 లీగ్‌లో పాల్గొనాలని ఎంసీఏ వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.అదనంగా రూ. 15 లక్షలు ఈ విషయం గురించి ఎంసీఏ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ముంబైకి ఆడే టీమిండియా ఆటగాళ్లందరూ ముంబై టీ20 లీగ్‌లో ఆడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ లీగ్ మొదలవుతుంది. కాబట్టి.. టీమిండియా తరఫున విధుల్లో లేని వారు తప్పకుండా ఇందులో పాల్గొనాలి.ఒకవేళ గాయాల బెడదతో బాధపడుతూ ఉంటే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ లీగ్‌లో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లకు వేలం ఫీజుకు అదనంగా రూ. 15 లక్షలు ఇవ్వాలని ఎంసీఏ నిర్ణయించింది. త్వరలోనే ఆటగాళ్ల కనీస ధరను నిర్ణయిస్తాం.ఈ సీజన్లో ముంబై టీ20 లీగ్‌కు అనూహ్య స్పందన వస్తోంది. 2800కి పైగా ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ముంబైకర్లకు క్రికెట్ అంటే ఎంత మక్కువో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. టీమిండియాకు భవిష్యత్ తారలను అందించేందుకు మేము చేసే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది’’ అని సదరు ఎంసీఏ అధికారి పేర్కొన్నారు. కాగా.. వీలైతే రోహిత్ శర్మను కూడా రంగంలోకి దింపి ఈ లీగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే యోచనలో ఎంసీఏ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం


