అనుమతి లేని ఆసుపత్రులపై చర్యలు
నల్లజర్ల రూరల్: అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం క్లస్టర్ డాక్టర్, అడిషనల్ డీఎంహెచ్‌వో జి.సుజాత హెచ్చరించారు. నల్లజర్ల మండలంలోని దూబచర్ల, నల్లజర్ల గ్రామాల్లో మూడు ఆసుపత్రులు, మూడు ల్యాబ్‌ల అనుమతి పత్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. దూబచర్లలో కొల్లా విజయభాస్కర్ నిర్వహిస్తున్న క్లినిక్‌కు ఎటువంటి అనుమతి, అర్హత పత్రాలు లేనట్టు పరిశీలనలో వెల్లడైందని చెప్పారు. అక్కడ గోదావరి సూపర్ స్పెషల్ క్లినిక్ పేరిట ప్రిస్కిప్షన్ ప్యాడ్లు ఉన్నాయని తాను బీహెచ్ఎంఎస్ చదివినట్టు డాక్టర్ చెబుతున్నారన్నారు.
తన సర్టిఫికెట్లు విజయవాడ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఉన్నాయని రెండు రోజుల్లో అందించగలనని విజయభాస్కర్ అధికారులకు తెలిపారు. అప్పటివరకు క్లినిక్‌ను మూసిఉంచాలని తాను ఆదేశించానని సుజాత తెలిపారు. నల్లజర్లలో శ్రీశ్రీ డెంటల్ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ లేదని, వెంటనే చేరుుంచాలని డాక్టర్ గన్నమనేని శ్రీనివాస్‌కు ఆమె సూచించారు. పీఎంపీలు, ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్లజర్ల పీహెచ్సీ డాక్టర్ జి.సుధీర్‌కుమార్, క్లస్టర్ హెల్త్ ఎడ్యుకేటర్ వీవీ శ్రీరామ్మూర్తి, సూపర్వైజర్ సుభాకర్ ఆమె వెంట ఉన్నారు.