గ్రేప్ క్రాప్
తగరపువలస : దక్కను ప్రాంతానికి పరిమితమైన ద్రాక్ష ఇటీవల ఇంటిపంటగా మారిపోయింది. మొదట్లో స్టేటస్ సింబల్‌గా అక్కడక్కడ ద్రాక్షపాదులను పెంచడం మొదలుపెట్టేవారు. ఇటీవల అన్నిచోట్ల ద్రాక్షను తమ పెరట్లో వేసి మురిసిపోతున్నారు. చాలాచోట్ల తెగుళ్లు, సస్యరక్షణ లేక పోవడం తదితర కారణాలతో ఫలించకపోయినా కొన్నిచోట్ల దిగుబడిని ఇస్తున్నాయి. ఇప్పుడు కాంక్రీట్ వనంలో గుత్తులు మురిపిస్తున్నాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమిలి బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న బండారు ఎల్లాజి తగరపువలసలో పాతలోకల్ ఆఫీసు వీధిలోని తన ఇంట్లో ద్రాక్షమొక్కను నాటారు. ఇటీవల మొదటి దిగుబడిగా పులుపు,తీపి కలగలిపిన గుత్తులను ఇచ్చిన ద్రాక్షపాదు మళ్లీ నిండా విరగకాసింది. పాదునిండా సొగసైన గుత్తులతో ఈ ప్రాంతంలోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.