కేబీసీ 2013లో తొలి కోటీశ్వరుడు
ఉదయ్‌పూర్‌కు చెందిన తాజ్ మహ్మద్ రంగ్రేజ్ ఓ చరిత్ర ఉపాధ్యాయుడు కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. టీవీ చరిత్రలోనే అత్యంత సూపర్ హిట్ గేమ్ షోగా నిలిచిన కౌన్ బనేగా కరోడ్‌పతి ఏడో సీజన్లో తొలి కోటీశ్వరుడయ్యాడు. కోటి రూపాయలు గెలుచుకున్నానంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని.. అయితే తనమీద తనకు మాత్రం నమ్మకం ఉందని చెప్పారు. ఆట మొదట్లోనే లైఫ్లైన్లన్నింటినీ అందుకే వాడుకోలేదని తెలిపారు.
ఇప్పుడు తాను కోటి రూపాయలు గెలుచుకోవడంతో ముందుగా.. పాక్షికంగా అంధురాలైన తన ఏడేళ్ల కుమార్తెకు చికిత్స చేయించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలని, అలాగే చదువుకునే పరిస్థితి లేని ముగ్గురు విద్యార్థినులను చదివిస్తానని, ఇద్దరు అనాథలకు పెళ్లి చేయిస్తానని చెప్పారు.