పదికి పది వికెట్లు.. రైల్వేస్ బౌలర్ రికార్డు
రైల్వేస్ బౌలర్ కరణ్ ఠాకూర్ సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25)లో రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పదివికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కరణ్ ఘనత సాధించాడు. వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కరణ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువ పేసర్ కరణ్ సీకే నాయుడు ట్రోఫీలో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బరోడాపై కరణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 28.5-5-77-10 గణాంకాలు నమోదు చేశాడు. కరణ్ ఆస్ట్రేలియా పేస్ లెజెండ్ మెక్‌గ్రాత్ వద్ద బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. అవుట్ స్వింగర్లే తన బౌలింగ్ బలమని కరణ్ చెప్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చెత్తగా ఆడటంతో రైల్వేస్ పది వికెట్లతో ఓటమి చవిచూసింది.