talktime
-
జియో: 12 వేల నిమిషాల టాక్ టైం
సాక్షి, ముంబై: గత ఏడాది ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ (ఐయూసీ)లను వడ్డించిన రిలయన్స్ జియో కొత్త పథకాలతో తన వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది. (జియో ఫైబర్ ఆఫర్ : జీ5 ప్రీమియం ఉచితం) రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ 2599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఇది వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం లభ్యం. రోజుకు 2జీబీ డేటాతోపాటు 10జీబీ డేటా బోనస్ అదనంగా అందిస్తుంది. అంటే సంవత్సరానికి మొత్తం 740 జీబీ డేటాను వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు. అలాగే డిస్నీ + హాట్‌స్టార్ వార్షిక ఉచిత చందా . 2399రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఇది కూడా వార్షిక చందానే. నాన్-జియో ఎఫ్‌యూపీ 12,000 నిమిషాలు. రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభ్యం. అయితే ఈ ప్లాన్‌లో 10జీబీ అదనపు డేటాను లేదా డిస్నీ + హాట్‌స్టార్‌కు సభ్యత్వం లభించదు. 2121 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: 336 రోజుల వాటిడిటీ, నాన్-జియో ఎఫ్‌యూపీ 12,000 నిమిషాల టాక్ టైం అదిస్తుంది. రోజు 1.5 జీబీ డేటా, ఎస్ఎంఎస్లు లభ్యం. 1299 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ కూడా 336 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం లభ్యం ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా, జియో టు జియో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ , రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు 4999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ లో రోజువారీ డేటా పరిమితి లేకుండా 350 జీబీ అపరిమిత డేటాను తెస్తుంది. ఇతర నెట్‌వర్క్‌లకు12000 నిమిషాల టాక్ టైం అందిస్తుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్లు. -
బీఎస్ఎన్ఎల్ లోన్ టాక్‌టైమ్ ప్లాన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అధిక టెలికాం కంపెనీలు రూ.200 దాటిన డిజిటల్ రీచార్జ్‌లనే అనుమతిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు స్టోర్స్‌లోకి వెళ్లి రీచార్జ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఎగువ నుంచి దిగువ తరగతి కస్టమర్లకు లాభం కలిగించే విధంగా సరికొత్త టాక్‌టైమ్ లోన్స్(రుణాలు)తో ముందుకొచ్చింది. టాక్‌టైమ్ లోన్స్ ప్రారంభ ధర రూ.10 నుంచి 50 రూపాయల వరకు వినియోగదారులు లోన్ తీసుకునే అవకాశం కల్పించింది. అయితే టాక్‌టైమ్ లోన్స్(రుణాలు) కావాలనుకునే వారు యూఎస్ఎస్డీ (USSD) కోడ్(*511*7#)లో నమోదు చేసుకోవాలని సంస్థ పేర్కొంది. ఈ కోడ్ నమోదు చేసుకోగానే వినియోగదారులకు దృవీకరించినట్లు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఈ ఎస్ఎమ్ఎస్లో లోన్‌కు సంబంధించిన వివరాలుంటాయి. వినియోగదారులకు కావాల్సిన రీచార్జ్ నెంబర్లు ఉంటాయి. రీచార్జ్‌కు కావాల్సిన నెంబర్‌ను ఎంచుకొని సెండ్ ఆఫ్షన్ క్లిక్ చేస్తే లోన్ రీచార్జ్ అవుతుంది. కాగా, మెరుగైన సేవల కోసం వినియోగదారులు మై బీఎస్ఎన్ఎల్ యాప్‌లో లాగిన్ అయ్యాక గో డిజిటల్ ఆఫ్టన్‌ను సెలక్ట్ చేయాలని తెలిపింది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ రూ .18తో కాంబో ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.8 జీబీ డేటాను, 250 నిమిషాల ఉచిత కాల్ టాక్‌టైమ్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 2 రోజుల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. రూ .108 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 1జీబీ డేటాతో పాటు 500 ఎస్ఎంఎస్లను 60 రోజుల కాలపరిమితిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. (రూ .153 ప్లాన్):ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 1 జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎంఎస్లను 180 రోజుల కాలపరిమితితో పొందవచ్చు. (రూ .186 ప్లాన్): ఈ ప్లాన్ ద్వారా ప్రతి రోజు 2 జీబీ, 100 ఎస్ఎంఎస్లను 180 రోజుల కాలపరిమితో పొందవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్డౌన్ సమయంలో మొబైల్ సబ్‌స్కైబర్స్‌కు వెసులుబాటు కలిగించేలా ఒక ప్రకటన చేసింది. ఉచితంగా వ్యాలిడిటీని పొడగించడంతోపాటు, టాక్‌టైమ్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ సమయంలో రీచార్జ్ చేసుకోవడం కుదరని వారికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. మర్చి 20 తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన మొబైల్ వినియోగదారులకు ఏప్రిల్ 20 వరకు ఉచితంగా వ్యాలిడిటీని పొడిగించనున్నట్టు ప్రకటించింది. అలాగే లాక్డౌన్ కాలంలో వినియోగదారుల బ్యాలెన్స్ జీరోకు చేరితే.. వారికి 10 రూపాయల ఉచిత టాక్‌టైమ్ అందించనున్నట్టు తెలిపింది. ‘ఈ కష్ట సమయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మద్దతుగా నిలుస్తుంది. వినియోగదారు రీచార్జ్ చేసుకోవడానికి డిజిటల్ పద్దతులు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు మై బీఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ వాలెట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
100 నిమిషాల టాక్ టైం ఉచితం..
న్యూఢిల్లీ: ఇటీవల ప్రతిష్మాత్మకంగా ప్రారంభమైన ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ డిజిటల్ చెల్లింపులవైపు శరవేగంగా పరుగులు తీస్తోంది. ఒక వైపు ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై అడుగులు వేస్తోంటే మరోవైపు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఇ-చెల్లింపులను భారీగా ప్రోత్సాహమిస్తోంది. ఇటీవల ఎన్ని రూపాయలు డిపాజిట్ చేస్తే అన్ని నిమిషాల టాక్ టైం ఫ్రీ అని ప్రకటించిన పే మెంట్ బ్యాంకు మరో ఆఫర్ ను మంగళవారం ప్రకటించింది. తమ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపిన ఎయిర్ టెల్ ఖాతాదారులకు 100 నిమిషాల మొబైల్ టాక్ టైంను ఉచితంగా అందిస్తోంది. తమ బ్యాంకు ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిపిన వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా ఈ ఆఫర్ అందించనున్నట్టు పే మెంట్ బ్యాంక్ తెలిపింది ప్రతీనెలాదాదాపు లక్షమంది ఖాతాదారులకు వంద నిమిషాల టాక్ టైం ను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. క్యాష్ లెస్ ఆర్థిక వ్యవస్థవైపు భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు తమ బ్యాంకు ప్రయత్నాలు సహాయం చేస్తాయని బ్యాంక్ సీఈవో , ఎండీ శశి అరోరా తెలిపారు. ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' విజన్ కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. భారతదేశం అంతటా జనవరి 2017 నుంచి మరికొన్ని ఆఫర్లు అందించనున్నట్టు తెలిపారు. వినియోగదారులకు అవగాహన 260 మిలియన్లకు పైగా ఉన్న తన వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు ప్రయోజనాలపై అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా ప్రాథమిక / ఫీచర్ మొబైల్ ఫోన్లతో యూఎస్ ఎస్ డి ఆధారిత చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. డిజిటల్ పేమెంట్స్ ఎకో సిస్టం దేశ వ్యాప్తంగా 30 లక్షలమంది భాగస్వామ్య సంస్థలతో కలిసి చిన్న చిన్న కిరణా దుకాణాలు, షాప్స్, రెస్టారెంట్స్ తదితర వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేయనుంది. తద్వారా మొబైల్ ఫోన్ల ద్వారానే చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఇలా ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంక్ వినియోగదారుల నుంచి సరుకులు మరియు సేవలకుగాను డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తుంది. ఉచిత డిజిటల్ చెల్లింపులు డిజిటల్ లావాదేవీలకు ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంక్ తన వినియోగదారులు, వ్యాపారులు, భాగస్వాముల నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయదు. ఉచితంగా ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి హిడెన్ అండ్ యాడెడ్ చార్జీలు ఉండవు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహమే లక్ష్యం. అలాగే వ్యాపారస్తులు, వినియోగదారుల నమోదు కూడా పూర్తిగా పేపర్ లెస్ గా ఉంటుంది. అంటే స్మార్ట్ ఫోన్ లోని ఒక యాప్ (స్మార్ట్ ఫోన్) సహాయంతో గానీ, యుఎస్ఎస్డీ (ఫీచర్ ఫోన్) ద్వారాగానీ ఉంటుంది. అంతే కాదు కాష్ విత్ డ్రాలను నిరోధించేందుకు గాను విత్ డ్రాలపై 0.65శాతం కూడా చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. దీని ద్వారా డిజిటల్ చెల్లింపులవైపు కస్టమర్లు మొగ్గు చూపుతారని బ్యాంక్ భావిస్తోంది. -
పాత రూ. 500 నోటుతో బీఎస్ఎన్ఎల్ అమూల్య ప్లాన్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పాత రూ. 500 నోటుతో బీఎస్ఎన్ఎల్ అమూల్యప్లాన్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు సంస్థ జీఎం పి.శామ్యూల్ జాన్ వెల్లడించారు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి రూ. 500 విలువ చేసే టాక్ టైమ్ కూడా ఉచితంగా ఇస్తామని శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.