Tamil film producer
-
ధనుష్ప నిషేధం ఎత్తివేత
-
Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్.. డీఎంకే మాజీ నేత అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారిగా, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ (36)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఎన్సీబీ సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను బ్యూరో ఛేదించడం తెలిసిందే. సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. అతనిపై త్వరలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మూడు దేశాలకు స్మగ్లింగ్ భారత్ నుంచి కొబ్బరి పొడి, మిక్స్ ఫుడ్ పౌడర్‌లో కలిపిన సూడోఎఫెడ్రిన్ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2023 డిసెంబర్లో ఎన్సీబీకి ఉప్పందించాయి. ఢిల్లీలో సాదిక్‌కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియాకు తరలిస్తున్న రాకెట్లో సాదిక్ కీలక సూత్రధారిగా తేలాడు. పైరేటెడ్ సీడీల నుంచి మొదలైన దందా సాదిక్ దందా పైరేటెడ్ సీడీలతో మొదలైంది. కెటమైన్ డ్రగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు స్మగ్లింగ్ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్‌కు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది! -
Narcotics Control Bureau: తమిళ నిర్మాత సూత్రధారిగా డ్రగ్స్ రాకెట్
న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్‌ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్‌తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్‌ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్లు ఎన్సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్దారాపూర్లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది. -
విజయకాంత్ మిత్రుడు ఇబ్రహీం మృతి
చెన్నై: తమిళ సినీ నిర్మాత ఏఎస్ ఇబ్రహీం రౌథర్(64) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. రౌథర్ ఫిలిమ్స్ పతాకంపై ఆయన పలు సినిమాలు నిర్మించారు. రాజకీయ నాయకుడిగా మారిన హీరో విజయకాంత్ కు చిరకాల మిత్రుడైన ఇబ్రహీం అవివాహితుడు. విజయకాంత్ సినిమా జీవితానికి ఇబ్రహీం ఇరుసులా ఉపయోగపడ్డారు. భరతన్, కారుప్పనిలా వంటి హిట్ సినిమాలు తీశారు. ఆయన తీసిన చివరి సినిమా 'పుత్తితగ ఆనందమ్ పుత్తితగ ఆరంబం' కొన్ని నెలల క్రితం విడుదలైంది. ఇబ్రహీం మరణం పట్ల తమిళ చిత్రపరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.