tamil labour
-
తమిళ కూలీల అరెస్టు
ఖాజీపేట : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు తమిళ కూలీలను పోలీసులు పట్టుకున్నారు. నాగసానిపల్లెకు వెళ్లే రహదారిలో ఉన్న చిలకకనం వద్ద ఎర్రచందనం తరలిస్తున్నట్లు ఖాజీపేట ఎస్ఐ రాజగోపాల్కు సమాచారం రావడంతో.. ఆయన తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తమిళనాడులోని సెంతిల్ తిరచునూరుకు చెందిన సెంతిల్, పోలూరుకు చెందిన దేవేంద్రన్ను అదుపులోకి తీసుకున్నారు. సెంతిల్ బీఈడీ చదువుకున్నాడు. నిరుపేద. దండిగా డబ్బు వస్తుందని అతనికి ఆశ చూపి తీసుకువచ్చినట్లు తెలిసింది. చివరకు ఇలా పోలీసులకు బుక్కయాడు. -
తమిళ కూలీలు పరారీ: ఎర్రచందనం స్వాధీనం
కడప : వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం అనుంపల్లి అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలోని తమిళకూలీలు... అటవీశాఖ అధికారులపై రాళ్ల దాడి చేశారు. దీంతో సదరు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో తమిళ కూలీలు పరారైయ్యారు. అనంతరం అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. తమిళ కూలీల కోసం వారు తనిఖీలు చేస్తున్నారు.