కాజల్‌కు కష్టకాలం
కాజల్ అగర్వాల్‌కు కష్టకాలం నడుస్తోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ బ్యూటీపై చర్యలు తీసుకోవడానికి తమిళ నిర్మాతల మండలి సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్లు కచ్చితంగా పాల్గొనాలని, లేని పక్షంలో పారితోషికంలో 20 శాతం కట్ చేయూలని తమిళ నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రంలో హీరోయిన్గా కాజల్ నటించింది.
ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి కాజల్ డుమ్మా కొట్టింది. అలాగే శరణ్యామోహన్ కోలాహలం చిత్ర ఆడియో విడుదలకు గైర్హాజరైంది. కాజల్, శరణ్యామోహన్పై చర్యలు తీసుకోవడానికి తమిళ నిర్మాతల మండలి సిద్ధమవుతున్నట్లు సమాచారం.