tangdhar sector
-
కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం
* చొరబాటు యత్నం భగ్నం * ఎన్కౌంటర్లో జవాను మృతి శ్రీనగర్: కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దు రేఖ సమీపంలోని తంగ్ధార్ సెక్టార్లో గురువారం మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా సైనికులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మిలిటెంట్లు హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మిలిటెంట్ల అక్రమ చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. మంగళవారం కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్లో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా జవాన్లు భగ్నం చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక మిలిటెంట్ హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. -
ఉగ్రవాదులను తిప్పికొట్టిన భారత సైన్యం
జమ్మూకాశ్మీర్: భారత సరిహద్దులలోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులను భారత సైన్యం తిప్పికొట్టింది. సరిహద్దులలోని టాంగ్ధర్ వద్ద వారు చొరబడ్డారు. భారత సైన్యం వారిని సమర్ధవంతంగా ఎదుర్కొంది. భారత సైనికులు జరిపిన కాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. భారత ఉపఖండంలో అల్‌ఖైదాను ప్రారంభిస్తున్నట్లు దాని అధినేత అల్ జవహరి ప్రకటించిన విషయం తెలిసిందే. అల్‌ఖైదా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ** -
ఆర్మీ కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి
భారత్‌లోని టాంగ్ధర్ సెక్టార్‌లోకి శనివారం ఉదయం కొందరు తీవ్రవాదులు చొరబాటుకు యత్నించారు. దాంతో స్థానికంగా పహారా కాస్తున్న భారత సైన్యం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారతసైన్యం చొరబాటుదారులపై కాల్పులకు ఉపక్రమించింది. ఆ కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. భారత సైన్యం జరుపుతున్న ఆ కాల్పులకు వెరవక తీవ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు యత్నిస్తున్నారు. దాంతో భారత్ సైన్యం చొరబాటుదారులపై కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.