tanker scam
-
మోదీజీ.. నేను రాహుల్ ని కాదు!
'నన్ను బెదిరించాలని, లొంగదీసుకోవాలని ఆయన (ప్రధాని) అనుకుంటున్నారు. గౌరవనీయులైన నరేంద్రమోదీ గారు.. మీరు ఏమైనా చేసుకోండి కానీ నన్ను ఆపలేరు. సులువుగా భయపడటానికి నేను రాహుల్ గాంధీని, సోనియాగాంధీని కాను. మీతో రాజీ పడటానికి నేను రాబర్ట్ వాద్రా కాను' అంటూ ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. వాటర్ ట్యాంకర్ కుంభకోణంలో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కేజ్రీవాల్ భగ్గుమన్నారు. ప్రధాని మోదీ తరఫున తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దమ్ముంటే తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. కేజ్రీవాల్ మంగళవారం విలేకరులతో మాట్లాడాతూ.. ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. 'ప్రధాని మోదీ తరఫున నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది అతి పెద్ద మోసం. తన ప్రత్యర్థులను బెదిరించడానికి మోదీ సీబీఐను పావుగా వాడుకుంటున్నారు. అయినా, ఆయన తప్పుడు చర్యలపై నేను గళమెత్తుతూనే ఉన్నాను' అని అన్నారు. -
షీలాకు కష్టాలు
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత షీలా దీక్షిత్ కష్టాలు ఎదురవనున్నాయి. ఆమె అతి త్వరలో ఏసీబీ దర్యాప్తును ఎదుర్కోనున్నారు. ట్యాంకర్ స్కాంకు సంబంధించి ఆమెపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అవినీతి కేసుల విచారణ సంస్థ ఏసీబీకి పంపించారు. ఈ కేసుపై విచారణ చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. దీంతో ఆమెపై విచారణ ప్రారంభంకానుంది. 2012లో ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం 385 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా ఉన్న నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కమిటీని వేసి ఆమెపై దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ కు నాడు ఫిర్యాదు చేయగా ఆయన ఇప్పుడు స్పందించాడు. -
మాజీ సీఎం షీలాదీక్షిత్ పై FIR