tantex celebrations
-
టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలు 2022 జనవరి 29న శనివారం డల్లాస్‌లోని తోమా ఈవెంట్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయలు ఉట్టిపడేలా ఆటపాటలతో రంగురంగుల ముగ్గులతో ఎంతో ఉత్సాహభరితంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా టాంటెక్స్ 2021 అధ్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి గారు ప్రసంగిస్తూ.. టాంటెక్స్ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలు, సాంకేతిక శిక్షణలు నిర్వహించామన్నారు. కరోనా టైంలో వర్కువల్ ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. 2022 పాలక మండలికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. 2022 అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి మాట్లాడుతూ... ఈ ఏడాది మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఆటల పొటీలు, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించబోతున్నట్టు భవిష్యత్ కార్యాచరణ వివరించారు. నూతన కార్యవర్గ బృందాన్ని ఒక చక్కటి గేయంతో సభకు పరిచయం చేశారు. టాంటెక్స్ అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి, సమన్వయకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటిల ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉత్తరాధ్యక్షుడుగా శరత్ రెడ్డి ఎర్రం, ఉపాధ్యక్షులుగా సతీష్ బండారు, కార్యదర్శిగా సురేష్ పఠనేని, కోశాధికారిగా సుబ్బారెడ్డి కొండు, సంయుక్త కోశాధికారిగా భాను ప్రకాష్ వెనిగళ్ల ను పరిచయం చేసారు. పాలక మండలి అధిపతి వెంకట్ ములుకుట్ల గారు మరియు ఉపాధిపతి అనంత్ మల్లవరపులు ప్రసంగిస్తూ.. అందరికీ 2022 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాలను చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల వినాయకుడి మీద ప్రార్ధనా గీతంతో మొదలుపెట్టారు. కూచిపూడి కళాక్షేత్రకు చెందిన పిల్లలు సూర్య భగవానుడికి తమ కూచిపూడి నృత్యం ద్వారా ఆదిత్య పుష్పాంజలి సమర్పించారు. లాస్య సుధా అకాడమీ, గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, సాయి నృత్య అకాడమీ స్కూల్ ఆఫ్ కూచిపూడికి చెందిన చిన్నారులు కూచిపూడి నృత్యం ద్వారా అన్నమయ్య కీర్తనలకు, వందేమాతరంకు నర్తించారు. లాస్య సుధా అకాడమీకి చెందిన చిన్నారులు భరతనాట్యంతో "సరసిజాక్షులు - కృష్ణ శబ్దం"ను ప్రదర్శించారు. కార్తి గ్రూప్, యూ డాన్స్ టీం, దేశి ఇల్యూషన్ గ్రూప్‌కి చెందిన పిల్లలు తెలుగు సినీచిత్ర గీతాలకు నర్తించి అందరినీ అలరించారు. డాలస్కి చెందిన కళాకారులు ప్రభాకర్ కోట, చక్రపాణి కుందేటి, శారద చిట్టిమల్ల, స్నిగ్ఢ ఏలేశ్వరపు తమ పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన శ్రీనివాసులు బసాబత్తిన, మధుమతి వైశ్యరాజు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను గుర్తు చేసుకుంటూ పిండి వంటలు, గొబ్బెమ్మలు, గాలి పటాలు, ఎద్దుల పోటీలు, హరిదాసులు, గంగిరెద్దులు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కొత్తగా భాద్యతలు స్వీకరించిన సాంస్కృతిక కార్యదర్శి మాధవి లోకిరెడ్డి ఎంతో నేర్పుగా సమయస్ఫూర్తితో కార్యక్రమాలని ముందుకు నడిపించారు. కార్యక్రమ సమన్వయకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి, పొషక దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నిర్వహించిన దీపావళి వేడుకలు నవంబర్ 9వ తేదీన డల్లాస్‌లోని ఫ్రిస్కో ఫ్లైయర్స్ ఈవెంట్ సెంటర్లో అంగరంగ వైభవంగా, కనుల పెండుగగా జరిగాయి. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఈవెంట్ కోఆర్డినేటర్ వెంకట్ బొమ్మ, వారి కార్యవర్గ బృందంతో కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాంగణమంతా అందమైన అలంకరణతో ముస్తాబై, అతిథులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. యాంకర్ సంధ్య మద్దూరి ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతదేశం నుంచి వచ్చిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, వారి బృందం యాంకర్ సాహితి, గాయకులు సుమంగళి, శ్రీకాంత్, సింహాత్రి, సౌజన్య, ప్రవీణ్, ఇమిటేషన్ రాజు తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం కోటి అందించిన 1980, 1990లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన చిరంజీవి మూవీ హిట్స్ పాటలతతో అందరి హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. అనంతరం టాంటెక్స్ అధ్యక్షులు చిన్న సత్యం మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన దీపావళి పోషక దాతలకు ధన్యవాదాలు తెలిపి, సత్కరించారు. టాంటెక్స్ ఎల్లప్పుడూ వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి చివరి వరకు జరిగేలా సహాయం, సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, వారి బృందానికి టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్దరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు,ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మీ, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, శరత్ యర్రం, కళ్యాణి తాడిమేటి, పాలక మండలి అధ్యక్షుడు ఎన్ ఎమ్ రెడ్డి, పవన నెల్లుట్ల, ఇందురెడ్డి, మందాడి.. శాలువ కప్పి సతక్కరించారు. కాగా టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు కోటి ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈవెంట్‌ను విజయవంతం చేసిన అందరికీ, ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు అలాగే వివిధ కమిటీ సభ్యులకు,స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చివరిగా జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లదపరిచిన దీపావళి వేడుకలు ముగిశాయి. -
ఘనంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
డాలస్/ ఫోర్ట్ వర్త్: అమెరికాలోని సాహిత్య, సంగీత సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేశారు. సాంస్కృతిక బృంద సమన్వయ కర్త పద్మశ్రీ తోట ఆధ్వర్యంలో, శీలం కృష్ణవేణి అధ్యక్షతన డాలస్‌లో జనవరి 27న స్థానిక మార్తోమా చర్చి ఆడిటోరియంలో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా చాలా ఆసక్తికరంగా సాగాయి. కూచిపూడి నృత్యాలు, ‘దైర్యే సాహసే లక్ష్మి’ అనే నృత్యరూపకం పలువురిని ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు పిల్లలు చేసిన డ్యాన్స్‌లు హుషారును నింపాయి. వినూత్నంగా ‘అమ్మ’ పాటలతో సాగిన నృత్య రూపకం అందరిని ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ నూతన అధ్యక్షులు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పర్యదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్దం అని అన్నారు. నిస్వార్ద కళా సేవకులు, నిర్విరామ శ్రామికులు తన కార్యవర్గ సభ్యుల అండదండలతో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలకు తన శాయశక్తులా సహాయ పడతానని ఆమె అన్నారు. అంతేకాక 32 సంవత్సరాల చరిత్ర ఉన్న టాంటెక్స్ లాంటి విశిష్ట సంస్థకు అధ్యక్ష పదవి చేపట్టినందుకు సర్వదా కృతజ్ఞురాలునని, టాంటెక్స్ సంస్థ తెలుగు వారందరికి మరింత చేరువయ్యేలా చేసి, తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఉప్పలపాటి కృష్ణారెడ్డికి శాలువా కప్పి పుష్ప గుచ్చాలతో టాంటెక్స్ అధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యవర్గ, పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. 2017 సంవత్సరంలో పోషక దాతలను కృష్ణారెడ్డి ఉప్పలపాటి, శీలం కృష్ణవేణి, మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. కొత్తగా ఎన్నికైన సంస్థ కార్యనిర్వహక సభ్యులు కోడూరు కృష్ణారెడ్డి, పాలేటి లక్ష్మి, బండారు సతీష్, చంద్ర పోలీస్, బొమ్మ వెంకటేష్, యెనికపాటి జనార్ధన్‌లను, పాలక మండలి సభ్యులు నీలపరెడ్డి మధుసూదన్ రెడ్డి, మందాడి ఇందు రెడ్డి, నెల్లుట్ల పవన్ రాజ్, అర్రెబోలు దేవేందర్ రెడ్డిలను సాదరంగా కమిటీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి రజిత విచ్చేశారు. నటి తన హాస్యోక్తులతో, చిరు నాటకతో ప్రేక్షకులను అలరించారు. అతిథి రజితకు సంస్థ కార్యవర్గ సభ్యులు శాలువ కప్పి, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమానికి సహాకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన, శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది. -
డాలస్‌లో జోరుగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను డాలస్‌లోని ఇర్వింగ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రమణ్యం, కార్యక్రమ సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మిఆధ్వర్యంలో, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త పాలేటి లక్ష్మి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరిగాయి. డాక్టర్ కలవగుంట సుధ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంప్రదా నృత్యాలు, సినిమా పాటలతో కూడిన డాన్స్ మెడ్లీలు హుషారుగా సాగాయి. జానపద గీతాలు, జోష్‌తో కూడిన డాన్సులను కళాకారులు ప్రదర్శించారు. కామేశ్వర శర్మ పంచాంగ శ్రవణం చేశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆ తర్వాత స్థానిక బావర్చి రెస్టారెంట్ నుంచి వచ్చిన ఉగాది పచ్చడితో పాటు షడ్రుచులతో కూడిన భోజనంతో ఆహూతులను అలరించారు. పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణతో చేతులు జోడించి నమస్కరిస్తూ అందరినీ ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు సుమారు వెయ్యి మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. టాంటెక్స్ 30 వసంతాల పుట్టినరోజును కూడా ఘనంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని సంస్థ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రమణ్యం అన్నారు. టాంటెక్స్ శాశ్వత భవనానికి ఆమోదం లభించింది కనుక ఇక ఇప్పుడు తగినంత నిధులు సమకూర్చుకుని, అనువైన స్థలం ఎంపిక చేసి, ఆ తర్వాత భవననిర్మాణ పనులు మొదలుపెట్టాలన్నారు. ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2016 ఉగాది పురస్కారాలను ఈ సంవత్సరం సాహిత్యం, వైద్య, సామాజిక సేవా రంగాలలో సేవలందించిన వారికి ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో సత్యం మండపాటి, వైద్యరంగంలో డా. రాఘవేంద్ర ప్రసాద్, సంఘసేవ/సామాజిక సంక్షేమ రంగంలో పూర్ణ నెహ్రులకు ఈ పురస్కారాలను అందజేశారు. వారితోపాటు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, బొమ్మినేని సతీష్ లను బెస్ట్ వాలంటీర్ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథి కళాకారులైన ఇంద్రనీల్, మేఘన, పారిజాత, ప్రవీణ్ లను టాంటెక్స్ కార్యవర్గ బృందం జ్ఞాపికలతో, దుశ్శాలువతో సత్కరించారు.