సమాచార హక్కు చట్టంపై అవగాహన
బాలాజీచెరువు (కాకినాడ) :
సమాచార హక్కు చట్టంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార కమిషనర్ ఎల్.తాంతియాకుమారి పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో సోమవారం సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక వారోత్సవాల్లో భాగంగా ఆర్టీఐ చట్టం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం సాధించే విధానం అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తాంతియాకుమారి మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం వల్ల వ్యవస్థ మెరుగుపడుతుందని, ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఉపయోగపడుతుందని, 2008 నుంచి 2016 వరకూ సుమారు 12వేల కేసులను పరిష్కరించామని చెప్పారు. దేశంలోనే ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం ఇవ్వడంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రతి విశ్వవిద్యాలయం, కళాశాలలో ఈ చట్టం సక్రమంగా అమలయ్యేలా కృషిచేస్తున్నామని, విద్యార్థులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుని పరీక్ష ఫీజు చెల్లింపు, కోర్సుల వివరాలు వంటివి లె లుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూకే రిజిస్ట్రార్ సీహెచ్ సాయిబాబు, రెక్టార్ ప్రభాకరరావు, ప్రిన్సిపాల్ ప్రసాద్‌రాజు, నాళం ఆండాళ్, చేతన పాల్గొన్నారు.