ఆమె చెప్పే విషయాల్లో గందరగోళం: సీపీ
టాంజానియా యువతి కేసు విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎన్ఎస్ మేఘారిఖ్ చెప్పారు. కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్లు చెప్పడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసు విషయం గురించి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఆమె చెప్పే విషయాలు చాలా గందరగోళంగా ఉన్నాయని.. కారులో నలుగురు ఉన్నట్లు ఆమె చెబుతుంటే, ఆమె స్నేహితులు మాత్రం కారులో ఐదుగురు ఉన్నారంటున్నారని సీపీ మేఘారిఖ్ అన్నారు. అసలు ఆ ఘటనా సమయంలో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని తాము నిర్ధారిస్తున్నామన్నారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో అక్కడ పోలీసులు కూడా ఉన్నట్లు చెప్పడంతోనే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని తెలిపారు. దీనిపై కూడా విచారణ కొనసాగిస్తున్నామన్నారు.