కొరికావు.. ఓపెనర్ గా వచ్చావు
బీజింగ్:'కొరికితే కొరికావు కానీ నీవల్ల మాకు బ్రహ్మాండమైన బిజినెస్' అంటున్నారు చైనీయులు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీల్లో ప్రత్యర్థిని గట్టిగా కొరికి సస్పెన్షన్ కి గురైన ఉరుగ్వే ఆటగాడు లూయీ స్వారెజ్ పేరిట బాటిల్ ఓపెనర్లను తయారుచేసి అమ్ముతున్నారు చైనా ఆన్ లైన్ వ్యాపారులు. టావోబావో వంటి చైనీస్ ఆన్ లైన్ స్టోర్స్ సువారెజ్ కొరికేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉన్న బాటిల్ ఓపెనర్లను ఇప్పుడు విరివిగా అమ్ముతోంది.
ఇప్పుడు ఈ ఓపెనర్లకు బోల్డంత గిరాకీ ఉంది. ఒక స్వీడిష్ సెక్స్ టాయ్స్ కంపెనీ కూడా స్వారెజ్ పళ్ల లాంటి నిపుల్ క్లిప్ లను కూడా తయారు చేసి అమ్మేస్తోంది.