ట్రాన్సిస్టర్
ఎలా పనిచేస్తుంది?
టేప్రికార్డర్లు, ఎంపీత్రీలు, ఎంపీఫోర్లు అంతగా వాడకంలోకి రాని రోజుల్లో ప్రధాన వినోద సాధనంగా అప్పట్లో అందరూ ట్రాన్సిస్టర్ని అధికంగా వాడేవారు. దీనినే ట్రాన్సిస్టర్ రేడియో అనేవారు. వాస్తవానికి రేడియోలాగా వుండే ఈ సాధనం పూర్తి - ‘ట్రాన్సిస్టర్ రేడియో రిసీవర్’. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
- ‘ట్రాన్సిస్టర్’ సిలికాన్, జర్మేనియం వంటి సెమీ కండక్టర్ లోహలతో తయారై వుంటుంది.
- ట్రాన్సిస్టర్‌లో రెండురకాలు వుంటాయి. జంక్షన్ ట్రాన్సిస్టర్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్.
- మొదటిరకం దాన్ని మూడు పొరలుగా చేస్తారు. రెండు పొరల మధ్య ఒకరకమైన సెమీ కండక్టర్ వుంచుతారు. పైన, కింది పొరలు సెమీ కండక్టర్ కంటే భిన్నమైనవి.
- మధ్యపొరను లేస్ అనీ, బయటిపొరను ఎమిటర్ అనీ అంటారు. మరొకటి కలెక్టర్.
- బేస్‌ను ఎమిటర్తో, కలెక్టర్‌తో కలిపే రెండు జంక్షన్లు వుంటాయి.
- ఎలక్ట్రానులు ఎమిటర్ నుండి బేస్ ద్వారా కలెక్టర్‌కు ప్రవహిస్తాయి. అప్పుడు విద్యుత్ జనిస్తుంది.
- బేస్‌లో ఎలక్ట్రాన్లు వుంటాయి. అవి తమలోనుండి వెళ్లే ఎలక్ట్రాన్ ప్రవాహన్ని నిలిపి వేస్తాయి.
- ఓల్టేజిలో మార్పులను ఇది అదుపుచేస్తుంది. వోల్టేజి ఏమాత్రం పెరిగినా, ఎమిటర్ నుండి కలెక్టర్‌కు వెళ్లే విద్యుత్ ప్రవాహంలో మార్పు వస్తుంది. అంటే రేడియో, టీవీలలో ఉండే ఈ చిన్న పరికరం ఎంత సమర్థంగా పని చేస్తే అవి కూడా అంత సమర్థంగా పని చేస్తాయన్నమాట.