Tapeswaram suruchi foods
-
సురుచిలో శేఖర్ మాస్టర్ దంపతుల సందడి
సాక్షి, మండపేట (కోనసీమ): ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, టీవీ డాన్స్‌షోల జడ్జి శేఖర్ మాస్టర్ సోమవారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో సందడి చేశారు. తన సతీమణి సుజాతతో కలిసి జిల్లాలోని ఆలయాల సందర్శనకు వచ్చిన ఆయన మార్గమధ్యంలో సురుచిలో ఆగారు. శేఖర్ మాస్టర్ దంపతులకు బాహుబలి కాజాను కానుకగా అందించి సత్కరించారు. చదవండి: (శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం) -
హీరో రామ్‌చరణ్‌కు బాహుబలి కాజాతో సత్కారం
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్‌చరణ్ కెరీర్లో 15వ చిత్రం. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాజమహేంద్రవరం వెళ్లిన రామ్‌చరణ్‌కు తాపేశ్వరం సురుచి పీఆర్ఓ వర్మ బాహుబలి కాజాను అందజేశారు. జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి గౌరవ పూర్వకంగా బాహుబలి కాజాను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. షెల్టాన్ హోటల్లో జరిగిన ఫోటోషూట్‌లో రామ్‌చరణ్‌కు వర్మ ఈ కాజాను బహుకరించారు. కాగా ఆర్సీ15 చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శిరీష్ దీనికి సహ నిర్మాత.అంజలి, సునీల్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
సినీనటుడు సంపత్‌కు బాహుబలి కాజాతో సత్కారం
సాక్షి, మండపేట: ప్రముఖ సినీ విలన్ సంపత్‌ను శుక్రవారం తాపేశ్వరంలోని మడతకాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కురసాల కల్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది. షూటింగ్లో పాల్గొన్న సంపత్‌ను సురుచి పీఆర్ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు. -
గాజువాక గణేశుని లడ్డూ 12.5 టన్నులు
మండపేట: వినాయక చవితి సందర్భంగా భారీ లడ్డూల తయారీలో పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ 12,500 కిలోల లడ్డూను తయారు చేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు విలేకరులతో మాట్లాడుతూ.. గతేడాది గుజరాత్‌లోని అరసూరి అంబాజిమాత దేవస్థానం ట్రస్టు తయారుచేసిన 11, 115 కిలోల లడ్డూ ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డుగా ఉందని, ఆ రికార్డును తాము అధిగమించనున్నట్లు తెలిపారు. 12,500 కిలోల లడ్డూను తయారు చేసి విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఏర్పాటు చేస్తున్న మహా గణపతికి సమర్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూ మాత్రమే పంపిస్తున్నామన్నారు. 12.5 టన్నుల లడ్డూ తయారీకి సుమారు రూ.30 లక్షలు అవుతుందన్నారు.