taskforce officers
-
హైదరాబాద్ లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం
-
సీఎం కేసీఆర్ పేరుతో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యదర్శిగా చలామణీ అవుతూ అమాయకులను మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని చెప్పి పలు రాజకీయ పార్టీల నాయకులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్న అతడిని రిమాండ్‌కు తరలించారు. అతడి మాటలు నమ్మి చాలా మంది పెద్ద ఎత్తున నగదు చెల్లించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన కమల్ కృష్ణా ఓ యూట్యూబ్ ఛానల్లో పని చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతడు సీఎం కేసీఆర్ పేరు చెప్పుకుని డబ్బులు వసూల్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా తాను పని చేస్తున్నట్లు.. బీసీ కార్పొరేషన్లో మీకు పదవి ఇప్పిస్తా అని ఆశచూపి నాయకుల నుంచి డబ్బులు రాబట్టారు. వివిధ పార్టీలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. సీఎం పేషీలో కార్యదర్శినని నమ్మించి డబ్బులు తీసుకుంటాడు. అనంతరం మొబైల్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. ఈ విధంగా అతడి బారిన చాలామంది నాయకులు మోసపోయారని సమాచారం. చివరకు సోమవారం నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో కదిలిన డొంక!
సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట): నకిలీ విత్తనాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంత చెప్పినా.. కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తితో నకిలీ దందా చేస్తున్నారు. అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాలు గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.13.51 కోట్ల విలువైన విత్తనాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ దందాను సూర్యాపేట జిల్లా పోలీసులు చాకచక్యంగా బయటపెట్టారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, గుడిహత్నూరు మండలాల్లో, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ భారీగా నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైతు ఇచ్చిన సమాచారంతో..: అనుమతి లేకుండా విత్తనాలను తయారుచేసి రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఓ రైతు ద్వారా అందించిన సమాచారంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. ద్వారకా సీడ్స్ పేరుతో వారు తయారు చేసిన మిర్చి, పలు కూరగాయలు, పుచ్చకాయ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.రూ.13.51 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులను సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ల సమక్షంలో గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడుకు చెందిన ఓ రైతు నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అదే గ్రామానికి చెందిన రైతు మాడా జగన్మోహన్రావు వద్ద ద్వారకా సీడ్స్ పేరుతో భారీగా ఉన్న విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. అవి అనుమతి లేనివని గుర్తించి, అతడిని విచారించగా, దీని వెనుక ఉన్న అసలు గుట్టును విప్పాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్న ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మాలపాటి వెంకటశివారెడ్డి.. ద్వారకా సీడ్స్ పేరుతో విత్తనాలను తయారు చేస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వనస్థలిపురంలోని గోడౌన్లో ఈ నెల 9న ఆకస్మిక తనిఖీలు చేయగా, రూ.13.51 కోట్ల విలువైన ద్వారకా స్టార్ బిందు పేరుతో ఉన్న 281.84 కిలోల ప్యాకింగ్ మిర్చి విత్తనాలు , 68 కిలోల కాలం ముగిసిన లూజ్ మిర్చి విత్తనాలు, ద్వారకా సీడ్స్ పేరుతో ఉన్న 45 కిలోల టమాట, 11.75 కిలోల బీరకాయ, ద్వారాకా సౌమ్య, సుప్రియా పేరుతో ఉన్న 479.3 కిలోల పుచ్చకాయ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలకు రంగులద్ది అమ్మకం.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మాలపాటి వెంకటశివారెడ్డికి గతంలో విత్తనాల కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2017లో ద్వారకా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో లైసెన్స్ పొందాడని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. విత్తన ప్యాకెట్లపై సరైన లేబుళ్లు ముద్రించలేదని, రైతులకు రశీదులు ఇవ్వకుండా రాత్రి సమయంలో బ్రోకర్ల ద్వారా విక్రయిస్తున్నాడని విచారణలో తేలిందని వివరించారు. మహారాష్ట్ర, కర్నాటక నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి రంగులద్ది వివిధ కంపెనీల పేరుతో ప్యాకింగ్ చేసి రైతులకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. కాగా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మాలపాటి వెంకటశివారెడ్డి, రీజినల్ మేనేజర్ వేమిరెడ్డి లక్షిరెడ్డి, వాసిరెడ్డి ప్రతాప్, సూకరి యాదగిరి, మాడా జగన్మోహన్, రమణలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఖమ్మంలో విత్తన దుకాణం సీజ్ ఖమ్మంలో లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న భాస్కర సీడ్స్ దుకాణాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. అందులో విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.26.38 లక్షల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అడవిరావుల చెర్వులో 18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం కొత్తపల్లిలో దాదాపు రూ.1,37,780 విలువ చేసే 166 ప్యాకెట్ల (దాదాపు 75 కేజీలు), గద్వాల జిల్లాలో 80 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాలలో వివిధ సీడ్స్ దుకాణాల్లో రూ.70వేల విలువ చేసే కాలం చెల్లిన విత్తనాలను పట్టుకున్నారు. ఆదిలాబాద్‌లో.. అనుమతి లేని రూ.23 లక్షల విలువైన పత్తి విత్తనాలను గురువారం ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో 3, గుడిహత్నూర్ మండలంలో 2 దుకాణాల్లో నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 1.5 లక్షల విలువైన 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. కాగా, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని మాదన్నపేటకు చెందిన బోల్లోని సాంబయ్య ఇంట్లో రూ.3.29 లక్షల విలువైన అనుమతుల్లేని నిమ్మకాయ నాగేశ్వర్ పీహెచ్ఎస్ 491 రకం 524 ప్యాకెట్ల మిర్చి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.4 కోట్లకు టోకరా
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడిని బుధవారం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాల్లో కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన దోమల రమేశ్(30)ని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హుజురాబాద్‌లోని డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లో సివిల్ పంచాయతీలు పరిష్కరించే కార్యాలయం తెరిచాడు. జిల్లా సివిల్ కోర్టు విజిలెన్స్ అధికారిగా తనను వరంగల్ జిల్లా జడ్జి నియమించినట్లు ఉత్తర్వులు సృష్టించుకొని అమాయలను బురిడికొట్టించాడు. స్కూల్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు నకిలీ అర్డర్లు సృష్టించి విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వివిధ న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేస్తున్నాడు. అందరిని నమ్మించేందుకు రెండు కార్లు కొని వాటికి జ్యుడిషియల్ శాఖకు చెందిన స్టిక్కర్లు అతికించి డిస్ట్రిక్ సివిల్ కోర్టు జ్యుడిషియల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా, సౌత్‌సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుగుతున్నాడు. రూ.4 కోట్ల వసూళ్లు జల్సాలకు అలవాటుపడ్డ రమేశ్ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు కైత రాంచంద్రంను పరిచయం చేసుకొని అతడి కొడుకుకు జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా, రాంచంద్రం స్నేహితుడు దశరథం బంధువుకు విద్యుత్‌శాఖలో ఉద్యోగం, వారి బంధువుల్లో మరొక మహిళకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేశాడు. రాంచంద్రం వద్ద అప్పు రూపంలో మొత్తం సుమారుగా రూ.4 కోట్ల వరకు తీసుకొని మోసం చేశాడు. అతడి వద్ద అప్పు తీసుకునే క్రమంలో రామగుండంలో అతడికి డబుల్బెడ్రూం ఇళ్లు ఉన్నట్లు రామగుండం తహసీల్దార్ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృషించి నమ్మించాడు. గోదావరిఖనిలో స్క్రాప్ బిడ్డింగ్ తనకే వచ్చిందని, ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ రీజనల్ కార్యాలయం ద్వారా రూ.5.34 కోట్లు వచ్చాయని, వరంగల్ జిల్లా జడ్జి తనకు జ్యుడిషియల్ ఆఫీసర్‌గా జీతం ఇస్తున్నట్లు రూ.2.75 లక్షల ఫేక్‌చెక్, జూనియర్ లెక్చరర్‌గా మంచిర్యాలలో అపాయింట్ అయినట్లు ఫేక్ అపాయింట్మెంట్, ఆర్బీఐ అకౌంట్ నుంచి రూ.5 కోట్లు వచ్చినట్లు ఫేక్ లెటర్, గోదావరిఖనిలోని ఎస్బీఐ(అప్పటి ఎస్బీహెచ్) బ్యాంకు అకౌంట్లో కోటి ఉన్నట్లు తప్పుడు పత్రం, జేపీహెచ్‌ఎస్ రామకృష్ణపూర్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సాలరీ సర్టిఫికెట్, ఐడీకార్డులు తయారు చేసి రూ.4కోట్లు వసూలు చేయగా రెండున్నర కోట్లు జల్సాలకే ఖర్చుచేసినట్లు , మిగతా ఒకటిన్నర కోటి పలువురి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. మోసం చేసి రెండోపెళ్లి..విడాకులు 2011లో గోదావరిఖనికి ఎలకపల్లికి చెందిన యువతిని ప్రే మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తెలియకుండా 2014 మే 18న కేశవపట్నం మండలంలోని ఒక గ్రామానికి చెందిన అ మ్మాయిని రెండోవివాహం చేసుకున్నాడు. అనుమానం వచ్చి న రెండో భార్య కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా రమేశ్, అతడి కుటుంబసభ్యులను అరెస్టు చేయగా తర్వాత రెండోభార్య రమేశ్‌తో విడాకులు తీసుకుంది. పక్కా ప్రణాళికతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ దోమల రమేశ్ ఆగడాల గురించి సమాచారమందుకున్న కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం ఉదయం హుజురాబాద్‌లో పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. అతడిని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుత సమాచారంతో ఎల్ఎండీ, హుజురాబాద్, గోదావరిఖని వన్‌టౌన్‌లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం నాలుగు రోజుల కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిపారు. రమేశ్‌వల్ల నష్టపోతే కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు లేదా సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రష్మిపెరుమాల్, టాస్క్‌ఫోర్స్ సీఐలు ప్రకాశ్, శశిధర్‌రెడ్డి, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
సినిమాల పేరుతో వ్యభిచార కూపంలోకి
సాక్షి, నెల్లూరు(క్రైమ్): షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ మైనర్ బాలికలు, యువతులకు ఎరవేస్తాడు. అనంతరం వారికి డబ్బు ఆశ చూపి లైంగికంగా అనుభవిస్తాడు. రహస్య కెమెరాల్లో వాటిని చిత్రీకరించి వారిని బెదిరించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్న ఓ వ్యక్తి గుట్టును నెల్లూరు టాస్‌్కఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సదరు వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార కేంద్రాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ప్రధాన నిందితుడితోపాటు ఎనిమిది మంది నిర్వాహకులు, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. ఏడుగురు బాధిత యువతులకు విముక్తి కల్పిచారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జి.శ్రీనివాసులురెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. బాలిక ఫిర్యాదుతో.. కోవూరుకు చెందిన ఓ బాలిక షార్ట్ ఫిల్మ్స్, సినిమాల పేరిట ఆకర్షించి చీకటి కార్యకలాపాల్లోకి దించుతున్నారని ఈనెల ఆరో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, నగర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో కూపీలాగడంతో డొంకంతా కదిలింది. అవకాశాలు కల్పిస్తానని.. నెల్లూరు నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన షేక్ జాకీర్‌హుస్సేన్ అలియాస్ మహేష్ నెల్లూరు స్టార్గన్ పేరుతో షార్ట్ ఫిల్మ్స్‌లు తీస్తున్నానంటూ విస్తృతంగా ప్రచారం చేశాడు. పరిచయమైన వ్యక్తులు, స్నేహితుల ద్వారా మైనర్ బాలికలను, యువతలను ఆకర్షించేవాడు. అనంతరం వారికి సినిమాల్లో అవకాశాలు కలి్పస్తానని చెప్పి శారీరకంగా అనుభవించేవాడు. వాటిని రహస్య కెమెరాల్లో చిత్రీకరించాడు. యువతులు, బాలికలకు చూపించి బ్లాక్‌మెయిన్ చేసి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించేవాడు. వచ్చిన ఆదాయాన్ని ఇరువురూ పంచుకునేవారు. నాలుగేళ్లుగా చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అదేక్రమంలో కొందరిని చేరదీసి వ్యభిచార గృహాలు నిర్వహించసాగాడు. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు తొలుత పోలీసులు జాకీర్‌హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కోటమిట్టరోడ్డులో, స్టోన్‌హౌస్‌పేట, పోస్టల్‌కాలనీ, జ్యోతినగర్‌లో, చి్రల్డన్స్పార్కు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు గురువారం ఏకకాలంలో ఆయా గృహాలపై దాడులు చేశారు. నిర్వాహకులు, విటులను అదుపులోకి తీసుకుని వారి చెరలో ఉన్న యువతులకు విముక్తి కల్పించారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, ల్యాప్‌టాప్, మోటార్‌బైక్, 14 సెల్ఫోన్లను స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు మీడియా ప్రతినిధులున్నారని తెలిసింది. సిబ్బందికి అభినందన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు వ్యభిచార కేంద్ర నిర్వాహకులు, విటులను అరెస్ట్ చేసేందుకు కృషిచేసిన టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, నగర ఇన్స్పెక్టర్లు మధుబాబు, వేమారెడ్డి, ఎం.నాగేశ్వరమ్మ, టీవీ సుబ్బారావు, వైవీ సోమయ్య, ఎస్సై బాబి తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిర్వాహకులు, విటుల అరెస్ట్ ► చిన్నబజారు ఇన్స్పెక్టర్ మధుబాబు కోటమిట్టరోడ్డులోని వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులు నూరీ, సుమలను, విటుడు ప్రభాకర్‌ను పట్టుకున్నారు. ► నవాబుపేట ఇన్స్పెక్టర్ కె. వేమారెడ్డి స్టోన్‌హౌస్‌పేటలో గృహంపై దాడిచేసి నిర్వాహకురాలు శ్రీలక్ష్మి, విటుడు నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. ► దర్గామిట్ట ఇన్స్పెక్టర్ ఎం.నాగేశ్వరమ్మ పోస్టల్‌కాలనీలోని వ్యభిచార గృహంపై దాడిచేసి నిర్వాహకులు లక్షి్మ, మల్లీశ్వరి అలియాస్ హారిక, విటుడు కె.శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. ► వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు జ్యోతినగర్‌లోని గృహంపై దాడిచేసి నిర్వాహకులు సునీత, శ్రీనివాసులు, విటుడు సుమన్‌ను అరెస్ట్ చేశారు. ► బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య చిలన్స్ పార్కు సమీపంలోని గృహంపై దాడిచేశారు. నిర్వాహకులు ప్రియాంక, విటుడు వంశీకృష్ణను పట్టుకున్నారు. వీరి నుంచి ఏడుగురు యువతులకు విముక్తి కలి్పంచి హోమ్‌కు తరలించారు. -
తిరుమలలో ఎర్రచందనం స్వాధీనం
తిరుమల: తిరుమలలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్, అటవీ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం కూంబింగ్ చేస్తున్న దళాలకు గంజిబండ అటవీ ప్రాంతంలో 26 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్మగ్లర్ల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. -
సైకోకి సంకెళ్లు
విజయవాడ సిటీ : గుంటూరు జిల్లాకు చెందిన పాతికేళ్ల యువకుడు బెంజసర్కిల్, పాతబస్తీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, ప్రముఖ వస్త్ర దుకాణాలకు వెళుతుంటాడు. అక్కడ ఖరీదైన కుటుంబాలకు చెందిన మహిళలు, యువతుల వద్దకు వెళ్లి తాను పర్సు మరిచిపోయానని, ఒకసారి ఫోన్ ఇస్తే తన సోదరునికి ఫోన్ చేసుకుంటానంటూ చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కొనుగోళ్ల హడావుడిలో ఉన్న వారు ఇతను అడిగినట్టుగానే మొబైల్ ఇస్తారు. ఆ తర్వాత తన మొబైల్‌కు వారి మొబైల్ నుంచి మిస్డ్‌కాల్ ఇచ్చుకొని తిరిగిచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు నుంచి తన సైకో చర్యలు ప్రారంభిస్తాడు. సమయ పాలనతో నిమిత్తం లేకుండా అసభ్యకర పదజాలంతో వారిని వేధింపులకు గురి చేస్తుంటాడు. ఇప్పటి వరకు 15 నుంచి 20 మంది వరకు ఈ తరహా వేధింపులు చేసినట్టు తెలిసింది. వీరిలో ఒక బాధిత కుటుంబం ధైర్యం చేసి విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యూహాత్మకంగా ఇతణ్ణి అదుపులోకి తీసుకున్నారు. గతంలో పట్టుకునేందుకు వెళ్లిన వారి నుంచి వివరాలు సేకరించిన టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం ఉదయం సైకో చెప్పిన ప్రాంతానికి ముందుగానే 20 మంది సిబ్బందిని సాధారణ దుస్తుల్లో పంపారు. అక్కడ వారు ఏదో పనులు చేస్తున్నట్టు నటిస్తూ ఫోన్లు మాట్లాడే వారిని నిశితంగా గమనించసాగారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు సైకో నంబరుకు కాల్ చేశారు. ఫోన్ రింగైన వెంటనే చూసుకున్న సైకో ఆన్సర్ చేయకుండా అధికారుల చర్యలను గమనించసాగాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన సిబ్బంది ఫోన్ రింగైన యువకుని వద్దకు వెళ్లి గమనించారు. అధికారులు పదే పదే చేస్తున్నా ఇతను చూసుకోవడం మినహా ఆన్సర్ చేయడం లేదు. సైకో ఇతనేనని నిర్థారించుకొని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాలు అంగీకరించాడు. అరెస్టు చేసి జైలుకు పంపారు. బాధిత కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.