సినిమాల పేరుతో వ్యభిచార కూపంలోకి | Molestation Of Young Girls In The Name Of Short Films And Films | Sakshi
Sakshi News home page

షార్ట్‌ ఫిల్మ్స్, సినిమాల పేరుతో వ్యభిచార కూపంలోకి

Published Fri, Nov 8 2019 7:29 AM | Last Updated on Fri, Nov 8 2019 7:29 AM

Molestation Of Young Girls In The Name Of Short Films And Films - Sakshi

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, చిత్రంలో సీఐలు

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): షార్ట్‌ ఫిల్మ్స్, సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ మైనర్‌ బాలికలు, యువతులకు ఎరవేస్తాడు. అనంతరం వారికి డబ్బు ఆశ చూపి లైంగికంగా అనుభవిస్తాడు. రహస్య కెమెరాల్లో వాటిని చిత్రీకరించి వారిని బెదిరించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్న ఓ వ్యక్తి గుట్టును నెల్లూరు టాస్‌్కఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. సదరు వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార కేంద్రాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ప్రధాన నిందితుడితోపాటు ఎనిమిది మంది నిర్వాహకులు, ఐదుగురు విటులను అరెస్ట్‌ చేశారు. ఏడుగురు బాధిత యువతులకు విముక్తి కల్పిచారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జి.శ్రీనివాసులురెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.

బాలిక ఫిర్యాదుతో.. 
కోవూరుకు చెందిన ఓ బాలిక షార్ట్‌ ఫిల్మ్స్, సినిమాల పేరిట ఆకర్షించి చీకటి కార్యకలాపాల్లోకి దించుతున్నారని ఈనెల ఆరో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, నగర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో కూపీలాగడంతో డొంకంతా కదిలింది.

అవకాశాలు కల్పిస్తానని.. 
నెల్లూరు నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన షేక్‌ జాకీర్‌హుస్సేన్‌ అలియాస్‌ మహేష్‌ నెల్లూరు స్టార్‌గన్‌ పేరుతో షార్ట్‌ ఫిల్మ్స్‌లు తీస్తున్నానంటూ విస్తృతంగా ప్రచారం చేశాడు. పరిచయమైన వ్యక్తులు, స్నేహితుల ద్వారా మైనర్‌ బాలికలను, యువతలను ఆకర్షించేవాడు. అనంతరం వారికి సినిమాల్లో అవకాశాలు కలి్పస్తానని చెప్పి శారీరకంగా అనుభవించేవాడు. వాటిని రహస్య కెమెరాల్లో చిత్రీకరించాడు. యువతులు, బాలికలకు చూపించి బ్లాక్‌మెయిన్‌ చేసి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించేవాడు. వచ్చిన ఆదాయాన్ని ఇరువురూ పంచుకునేవారు. నాలుగేళ్లుగా చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అదేక్రమంలో కొందరిని చేరదీసి వ్యభిచార గృహాలు నిర్వహించసాగాడు.

ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. మైనర్‌ బాలిక ఫిర్యాదు మేరకు తొలుత పోలీసులు జాకీర్‌హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కోటమిట్టరోడ్డులో, స్టోన్‌హౌస్‌పేట, పోస్టల్‌కాలనీ, జ్యోతినగర్‌లో, చి్రల్డన్స్‌పార్కు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు గురువారం ఏకకాలంలో ఆయా గృహాలపై దాడులు చేశారు. నిర్వాహకులు, విటులను అదుపులోకి తీసుకుని వారి చెరలో ఉన్న యువతులకు విముక్తి కల్పించారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, ల్యాప్‌టాప్, మోటార్‌బైక్, 14 సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు మీడియా ప్రతినిధులున్నారని తెలిసింది. 

సిబ్బందికి అభినందన  
ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేయడంతోపాటు వ్యభిచార కేంద్ర నిర్వాహకులు, విటులను అరెస్ట్‌ చేసేందుకు కృషిచేసిన టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, నగర ఇన్‌స్పెక్టర్‌లు మధుబాబు, వేమారెడ్డి, ఎం.నాగేశ్వరమ్మ, టీవీ సుబ్బారావు, వైవీ సోమయ్య, ఎస్సై బాబి తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

నిర్వాహకులు, విటుల అరెస్ట్‌  
చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు కోటమిట్టరోడ్డులోని వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులు నూరీ, సుమలను, విటుడు ప్రభాకర్‌ను పట్టుకున్నారు.  
► నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ కె. వేమారెడ్డి స్టోన్‌హౌస్‌పేటలో గృహంపై దాడిచేసి నిర్వాహకురాలు శ్రీలక్ష్మి, విటుడు నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు.  
► దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరమ్మ పోస్టల్‌కాలనీలోని వ్యభిచార గృహంపై దాడిచేసి నిర్వాహకులు లక్షి్మ, మల్లీశ్వరి అలియాస్‌ హారిక, విటుడు కె.శ్రీనివాసులను అరెస్ట్‌ చేశారు.  
► వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు జ్యోతినగర్‌లోని గృహంపై దాడిచేసి నిర్వాహకులు సునీత, శ్రీనివాసులు, విటుడు సుమన్‌ను అరెస్ట్‌ చేశారు.  
► బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వైవీ సోమయ్య చిలన్స్‌ పార్కు సమీపంలోని గృహంపై దాడిచేశారు. నిర్వాహకులు ప్రియాంక, విటుడు వంశీకృష్ణను పట్టుకున్నారు. వీరి నుంచి ఏడుగురు యువతులకు విముక్తి కలి్పంచి హోమ్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement