చిదంబరంతో సమావేశమైన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన చిదంబరంతో శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా చిదంబరం నగర శివారులోని ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా లాకిడ్ మార్టిన్ కంపెనీలను సందర్శించనున్నట్లు సమాచారం.
టాటా సెజ్ లో ఏర్పాటు చేసిన టాటా అడ్వాన్స్ డ్ సిస్టం లిమిటెడ్ , లాకిన్ మార్టిన్ సంస్థలో తయారయ్యే హెలికాప్టర్ విడిభాగాలను పరిశీలించనున్నారు. చిదంబరం వెంట రతన్ టాటా కూడా వెళ్లనున్నారు. అలాగే నగరంలో సినీ ఉత్సవాలకు హాజరుకానున్న చిదంబరం ఆదిభట్లనూ సందర్శించనున్నారని తెలుస్తోంది.
...........