ఈ-కామర్స్లోకిటాటా గ్రూప్
‘టాటాక్లిక్’ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు
ముంబై: టాటా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘టాటాక్లిక్.కామ్’ అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీన్ని టాటా యూనిస్టోర్ నిర్వహించనున్నది. టాటాక్లిక్లో టాటా ఇండస్ట్రీస్ 90 శాతం వాటాను, గ్రూప్ రిటైల్ విభాగం ట్రెంట్ మిగిలిన 10 శాతం వాటాను కలిగింది. ఈ-కామర్స్ మార్కెట్లో తొలిసారిగా ‘ఫిజిటల్’ విధానాన్ని ఆవిష్కరిస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. ఈ విధానంలో ఆన్లైన్లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసి, దాన్ని సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న 530 స్టోర్లలో ఎక్కడైనా తీసుకోవచ్చని వివరించారు. దీని ద్వారా డెలివరీ సమయం ఆదా అవుతుందని, ప్రొడక్ట్ సరిగా లేకపోతే.. రిటర్న్ చేయడం సులభంగా ఉంటుందని పేర్కొన్నారు.
తొలిగా అందుబాటులో 400 బ్రాండ్లు
టాటాక్లిక్ ఆన్లైన్ స్టోర్‌లో తొలిగా 400 బ్రాండ్లను అందుబాటులో ఉంచామని టాటాక్లిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశుతోష్ పాండే తెలిపారు. ఇందులోనే 25 ఎక్స్‌క్లూజివ్ ప్రీమియం విదేశీ బ్రాండ్లు (దుస్తులు, ఫుట్‌వేర్స్, ఎలక్ట్రానిక్స్) ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్ నాటికి వాచులు, సన్‌గ్లాసెస్, జువెలరీ ప్రొడక్ట్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భవిష్యత్తులో హోమ్ ఫర్నిచర్, బొమ్మలు వంటి విభాగాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.