Tatikonda Mandal
-
‘పాలమూరు’కు 800 ఏళ్ల చరిత్ర
భూత్పూర్ (దేవరకద్ర): పాలమూరుకు 800 ఏళ్ల చరిత్ర ఉందని, నిజాం నవాబు మహబూబ్ అలీ పేరు మీదుగా జిల్లాగా ఏర్పడిన మహబూబ్నగర్ అసలు పేరు పాలమూరు అన్న సంగతి తెలిసిందేనని పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. శనివారం భూత్పూర్ మండలం తాటికొండలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పురాతన కాలం నాటి శిల్పాలు గుర్తించామని ఆయన తెలిపారు. జడ్చర్ల సమీపంలోని గంగాపురం - నెక్కొండ దారిలో రాచమల్ల వారి దొడ్డి పక్కన పొలంలో ఉన్న క్రీ.శ.1,141 నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి రెండో జగదేక మల్లుని శాసనంలో పేర్కొన పాల్మురు, పాలమూరేనని పేర్కొన్నారు. కీ.శ.1128 నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుని శాసనంలో పేర్కొన్న పిల్లలమర్రి, మహబూబ్నగర్ శివారులోని పిల్లలమర్రిగా గుర్తించవచ్చన్నారు. క్రీ.శ.12వ శతాబ్దికే పాలమూరు పట్టణం, పక్కనే పిల్లలమర్రి ఉనికిలో ఉన్నాయన్నారు. -
ఆస్తి మొత్తం ఆలయాలకే.. రాజమ్మ రాజసం
అమరావతి: ఆస్తులకోసం ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో తనకున్న యావదాస్తిని ఆలయాలకు దానంగా ఇచ్చేశారు బొందలపాటి రాజమ్మ. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడుకు చెందిన ఆమె తన తల్లిదండ్రులనుంచి సంక్రమించిన ఆస్తిలో భద్రాచలం రామాలయానికి 3.14 ఎకరాలు, శ్రీశైల మల్లికార్జునస్వామి దేవస్థానానికి 3.62 ఎకరాలు, విజయవాడ కనకదుర్గమ్మకు 70సెంట్ల సాగుభూమి, 235 చదరపుగజాల ఇంటి స్థలాన్ని విరాళంగా అందజేశారు. అలాగే పెనుగ్రంచిపోలు తిరుపతమ్మ ఆలయానికి 210చదరపు గజాల ఇంటి స్థలాన్ని, కందిమల్లాయపాలెంలోని బ్రహ్మంగారి గుడికి 93 సెంట్ల సాగుభూమి, అమరావతి అమరేశ్వరునికి 212 చదరపుగజాలలో ఉన్న పెంకుటిల్లును విరాళంగా ఇచ్చేశారు. ఈ మేరకు వీలునామా రాసి గత డిసెంబర్ నెలలో మరణించారు. సోమవారం అమె కుమారుడు సాంబశివరావు ఈ ఆస్తులకు సంబంధించిన వీలునామాను అమరావతి దేవాలయ ఈవో పానకాలరావుకు అందజేశారు.