
ఆస్తి మొత్తం ఆలయాలకే.. రాజమ్మ రాజసం
అమరావతి: ఆస్తులకోసం ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో తనకున్న యావదాస్తిని ఆలయాలకు దానంగా ఇచ్చేశారు బొందలపాటి రాజమ్మ. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడుకు చెందిన ఆమె తన తల్లిదండ్రులనుంచి సంక్రమించిన ఆస్తిలో భద్రాచలం రామాలయానికి 3.14 ఎకరాలు, శ్రీశైల మల్లికార్జునస్వామి దేవస్థానానికి 3.62 ఎకరాలు, విజయవాడ కనకదుర్గమ్మకు 70సెంట్ల సాగుభూమి, 235 చదరపుగజాల ఇంటి స్థలాన్ని విరాళంగా అందజేశారు.
అలాగే పెనుగ్రంచిపోలు తిరుపతమ్మ ఆలయానికి 210చదరపు గజాల ఇంటి స్థలాన్ని, కందిమల్లాయపాలెంలోని బ్రహ్మంగారి గుడికి 93 సెంట్ల సాగుభూమి, అమరావతి అమరేశ్వరునికి 212 చదరపుగజాలలో ఉన్న పెంకుటిల్లును విరాళంగా ఇచ్చేశారు. ఈ మేరకు వీలునామా రాసి గత డిసెంబర్ నెలలో మరణించారు. సోమవారం అమె కుమారుడు సాంబశివరావు ఈ ఆస్తులకు సంబంధించిన వీలునామాను అమరావతి దేవాలయ ఈవో పానకాలరావుకు అందజేశారు.