Tatvamasi: హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘తత్వమసి’
వరలక్ష్మీ శరత్ కుమార్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తత్వమసి’. రమణ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఈఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని గురువారం విడుదల చేసింది చిత్రబృందం.
నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీచక్రం. దాని మధ్యలో ‘తత్వమసి’ అనే అక్షరాలపై ఎర్రని మరకలతో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, ఇషాన్, రాధాకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.