'ఇక ట్యాక్స్ టెర్రరిజం నుంచి విముక్తి'
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బిల్లుకు సహకరించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సోమవారం జీఎస్టీ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జీఎస్టీ బిల్లు ద్వారా ట్యాక్స్ టెర్రరిజం నుంచి స్వేచ్ఛ లభించిందని చెప్పారు. టీమిండియా దిశగా ముందడుగు పడిందని అన్నారు.
జీఎస్టీ బిల్లు తీసుకురావడమనేది భారత్ తీసుకున్న అతిగొప్ప నిర్ణయమని, పెద్ద ముందడుగు అని మోదీ అన్నారు. ఈ బిల్లు పాసచేయడం ద్వారా 'వినియోగదారుడే రాజు' అనే సందేశం పంపిన వాళ్లం అవుతామని చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు పోరాడిన భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ మోదీ జీఎస్టీ బిల్లుపై ప్రసంగాన్ని ప్రారంభించారు.