టీసీఎల్ ఐరిస్ స్కానర్ మొబైల్ @రూ.7,999
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న చైనాకు చెందిన టీసీఎల్ భారత స్మార్ట్‌ఫోన్ విపణిలోకి ప్రవేశించింది. ముందుగా టీసీఎల్-560 మోడల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఐరిస్ స్కానర్ ఫీచర్ దీని ప్రత్యేకత. ధర రూ.7,999. అమెజాన్ ద్వారా మాత్రమే కంపెనీ ఈ మోడల్‌ను భారత్‌లో విక్రయిస్తోంది. 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1.1 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగెన్ 210 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 6.0 ఓఎస్‌తో రూపొందించారు.
ఎల్ఈడీ ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ తదితర సదుపాయాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 2018 నాటికి 10 శాతం వాటాను కైవసం చేసుకుంటామని కంపెనీ ఇండియా డెరైక్టర్ ప్రవీణ్ వలేచా మొబైల్ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు. టీసీఎల్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఆల్కటెల్ వన్‌టచ్ ఇప్పటికే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. టీసీఎల్ బ్రాండ్ నుంచి కేవలం 4జీ స్మార్ట్ఫోన్లు ప్రవేశపెడతామని ఆయన అన్నారు.