Tea - Series
-
నీ స్వరం... తేనె ప్రవాహం!
యంగ్ టాలెంట్: తులసీ కుమార్ టీ-సీరిస్ యజమాని గుల్షన్ కుమార్ కుమార్తెగా కంటే, మంచి గాయనిగా తులసీ కుమార్ ఎక్కువమందికి పరిచయం. ‘రెడీ’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబాయి’ , ‘దబంగ్’ మొదలైన సినిమాలలో తులసీ కుమార్ పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.‘‘ప్రతిభ లేని వారిని ఘనమైన కుటుంబనేపథ్యం కూడా రక్షించలేదు’’ అనే తులసీ చెప్పే కబుర్లు కొన్ని...ఒకరోజు నేను పాట పాడుతుంటే నాన్నగారు విన్నారు. ఆయనకు నా గొంతు బాగా నచ్చింది. ‘‘భవిష్యత్తులో మంచి గాయనిగా పేరు తెచ్చుకో’’ అని దీవించారు. అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు. నాన్న ఆశీర్వాద బలమో ఏమో గానాన్నే వృత్తిగా ఎంచుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ భక్తి వాతావరణం ఉంటుంది. ఆ ప్రభావంతోనే మొదట్లో భక్తి పాటలు ఎక్కువగా పాడాను. కెరీర్ మొదట్లో భక్తి పాటలు పాడడం అనేది దేవుడి ఆశీస్సులు కోరడం లాంటిది. మొత్తం ఏడు భక్తి ఆల్బమ్‌లు చేశాను.అనూ మాలిక్ సంగీతం సమకూర్చిన ‘హమ్ కో దివానే కర్ గయే’ సినిమాకు తొలిసారిగా సోనూ నిగమ్‌తో కలిసి పాడాను. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. నా అభిమాన గాయని లతాజీ(లతా మంగేష్కర్), ఆశాజీ(ఆశా భోంస్లే) ఇప్పటి వాళ్లలో మాత్రం సోనూ నిగమ్ ‘పేయింగ్ గెస్ట్’ సినిమాలోని ‘చాంద్ ఫిర్ నిక్లా’ పాట అంటే ఇష్టం.నా పని విషయంలో నాకు నేనే విమర్శకురాలిని. నా మనసుకు నచ్చిన పాట పెద్దగా పాపులర్ కాకపోయినా నా అభిమానంలో మాత్రం తేడా ఉండదు. నటించమని ఆఫర్లు వస్తుంటాయి. కానీ సంగీతం మాత్రమే నాకు ప్రధానం. నటించడం వల్ల పాడడం మీద ఏకాగ్రత పోతుందని నా అభిప్రాయం. అందుకే నటనకు దూరంగా ఉన్నాను.ఎలాంటి పాటనైనా అలవోకగా పాడగలగడం అనే దాని మీద గాయకుల విజయం ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల పాటలూ పాడి మంచి గాయనిగా నిరూపించుకోవాలనేది నా కోరిక. -
నీ స్వరం... తేనె ప్రవాహం!
యంగ్ టాలెంట్: తులసీ కుమార్ టీ-సీరిస్ యజమాని గుల్షన్ కుమార్ కుమార్తెగా కంటే, మంచి గాయనిగా తులసీ కుమార్ ఎక్కువమందికి పరిచయం. ‘రెడీ’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబాయి’ , ‘దబంగ్’ మొదలైన సినిమాలలో తులసీ కుమార్ పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.‘‘ప్రతిభ లేని వారిని ఘనమైన కుటుంబనేపథ్యం కూడా రక్షించలేదు’’ అనే తులసీ చెప్పే కబుర్లు కొన్ని...ఒకరోజు నేను పాట పాడుతుంటే నాన్నగారు విన్నారు. ఆయనకు నా గొంతు బాగా నచ్చింది. ‘‘భవిష్యత్తులో మంచి గాయనిగా పేరు తెచ్చుకో’’ అని దీవించారు. అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు. నాన్న ఆశీర్వాద బలమో ఏమో గానాన్నే వృత్తిగా ఎంచుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ భక్తి వాతావరణం ఉంటుంది. ఆ ప్రభావంతోనే మొదట్లో భక్తి పాటలు ఎక్కువగా పాడాను. కెరీర్ మొదట్లో భక్తి పాటలు పాడడం అనేది దేవుడి ఆశీస్సులు కోరడం లాంటిది. మొత్తం ఏడు భక్తి ఆల్బమ్‌లు చేశాను.అనూ మాలిక్ సంగీతం సమకూర్చిన ‘హమ్ కో దివానే కర్ గయే’ సినిమాకు తొలిసారిగా సోనూ నిగమ్‌తో కలిసి పాడాను. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. నా అభిమాన గాయని లతాజీ(లతా మంగేష్కర్), ఆశాజీ(ఆశా భోంస్లే) ఇప్పటి వాళ్లలో మాత్రం సోనూ నిగమ్.‘పేయింగ్ గెస్ట్’ సినిమాలోని ‘చాంద్ ఫిర్ నిక్లా’ పాట అంటే ఇష్టం.నా పని విషయంలో నాకు నేనే విమర్శకురాలిని. నా మనసుకు నచ్చిన పాట పెద్దగా పాపులర్ కాకపోయినా నా అభిమానంలో మాత్రం తేడా ఉండదు. నటించమని ఆఫర్లు వస్తుంటాయి. కానీ సంగీతం మాత్రమే నాకు ప్రధానం. నటించడం వల్ల పాడడం మీద ఏకాగ్రత పోతుందని నా అభిప్రాయం. అందుకే నటనకు దూరంగా ఉన్నాను.ఎలాంటి పాటనైనా అలవోకగా పాడగలగడం అనే దాని మీద గాయకుల విజయం ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల పాటలూ పాడి మంచి గాయనిగా నిరూపించుకోవాలనేది నా కోరిక.