మొబైల్, డబ్బు కోసం టీచర్‌ను చంపేశారు
బీజింగ్: చైనాలో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ముగ్గురు విద్యార్థులు మహిళా టీచర్ (50)ను చంపి, ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోన్, 20 వేల రూపాయల నగదును దోచుకుని పారిపోయారు. ముగ్గురు విద్యార్థుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. హునన్ ప్రావిన్స్‌లోని లియన్క్వియావోలోనిఓ ఎలిమెంటరీ స్కూల్లో ఈ దారుణం జరిగింది. ఆ స్కూల్లో ఆమె ఒక్కరే టీచర్ కాగా.. దాడి చేసిన విద్యార్థులు వేరే స్కూల్లో చదువుతున్నారు.
విద్యార్థులు.. మహిళా టీచర్ నోట్లో గుడ్డ కుక్కి చెక్కతో పొడిచారు. అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లి బాత్రూమ్లో పడేశారు. మహిళా టీచర్ అక్కడికక్కడే మరణించారు. పారిపోయిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వలస కార్మికులు. పిల్లలను సొంత ఊళ్లోనే విడిచి.. ఉపాధి కోసం చైనాలోని ఇతర నగరాలకు వెళ్లారు.