డీఎస్సీ-2014కు 718 పోస్టులు
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో టెట్ కమ్ టీఆర్టీ -2014 (డీఎస్సీ-2014)కు మొత్తం 718 టీచరు పోస్టులు ప్రకటించారు. వీటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 688 పోస్టులు, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలలకు 30 పోస్టులు ప్రకటించారు. స్కూలు అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్, భాషా పండితులు గ్రేడ్-2 తెలుగు సబ్జెక్టుల్లో ప్రభుత్వ, జిల్లాపరిషత్ పాఠశాలలకు ఒక్క పోస్టు కూడా డీఎస్సీలో ప్రకటించలేదు.
ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలలకు కేటాయించిన 688 పోస్టులకు సంబంధించి మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ఏ రిజర్వేషన్ వర్గానికి ఎన్ని పోస్టులు వచ్చేది కూడా ప్రభుత్వం ప్రకటించింది. గత డీఎస్సీలో ఆగిపోయిన రోస్టర్ పాయింట్ నుంచి కొత్త రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లాలో రిజర్వేషన్ కేటగిరీ వారీగా, పోస్టుల వారీగా ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించిందీ ఈ దిగువ ఇస్తున్నాం.
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మొత్తం 571
ఓసీ జనరల్ 167, ఓసీ మహిళ 90, బీసీ ఏ జనరల్ 28, బీసీ ఏ మహిళ 12, బీసీ బీ జనరల్ 34, బీసీ బీ మహిళ 24, బీసీ సీ జనరల్ 4, బీసీ సీ మహిళ 1, బీసీ డీ జనరల్ 29, బీసీ డీ మహిళ 11, బీసీ ఈ జనరల్ 18, బీసీ ఈ మహిళ 5, ఎస్సీ జనరల్ 57, ఎస్సీ మహిళ 28, ఎస్టీ జనరల్ 22, ఎస్టీ మహిళ 12, వీహెచ్ జనరల్ 4, వీహెచ్ మహిళ 2, హెచ్ఐ జనరల్ 3, హెచ్ఐ మహిళ 3, ఓహెచ్ జనరల్ 4, ఓహెచ్ మహిళ 2, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ 10 పోస్టులు కేటాయించారు.
సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉర్దూ మొత్తం 8
ఓసీ జనరల్ 2, ఓసీ మహిళ 2, బీసీ ఏ జనరల్ 1, బీసీ బీ మహిళ 1, ఎస్సీ జనరల్ 1, ఓహెచ్ జనరల్ 1 పోస్టును కేటాయించారు.
స్కూలు అసిస్టెంట్ గణితం మొత్తం 14
ఓసీ జనరల్ 4, ఓసీ మహిళ 2, బీసీ ఏ మహిళ 2, బీసీబీ జనరల్ 1, బీసీబీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, ఎస్టీ మహిళ 1, వీహెచ్ జనరల్ 1 పోస్టు కేటాయించారు.
స్కూలు అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ మొత్తం 14
ఓసీ జనరల్ 4, ఓసీ మహిళ 3, బీసీ ఏ జనరల్ 1, బీసీ బీ జనరల్ 1, బీసీ బీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్టీ జనరల్ 2 పోస్టులు కేటాయించారు.
స్కూలు అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మొత్తం 43
ఓసీ జనరల్ 13, ఓసీ మహిళ 6, బీసీ ఏ జనరల్ 3, బీసీ ఏ మహిళ 1, బీసీ బీ జనరల్ 2, బీసీ బీ మహిళ 1, బీసీ డీ జనరల్ 3, బీసీ డీ మహిళ 1, బీసీ ఈ జనరల్ 1, ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళ 2, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, హెచ్ఐ జనరల్ 1, ఓహెచ్ మహిళ 1 పోస్టులు కేటాయించారు.
స్కూలు అసిస్టెంట్ తెలుగు ఒక పోస్టు ఉండగా..దీన్ని బీసీ డీ మహిళకు కేటాయించారు.
స్కూలు అసిస్టెంట్ ఉర్దూ ఒక పోస్టు ఉండగా..దాన్ని ఓసీ మహిళకు కేటాయించారు.
-స్కూలు అసిస్టెంట్ హిందీ మొత్తం 6
ఓసీ జనరల్ 2, బీసీ ఏ జనరల్ 1, బీసీ బీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టీ జనరల్ 1 పోస్టులు కేటాయించారు.
వ్యాయామోపాధ్యాయులు మొత్తం 17
ఓసీ జనరల్ 6, ఓసీ మహిళ 3, బీసీ ఏ మహిళ 1, బీసీ బీ జనరల్ 1, బీసీ డీ జనరల్ 2, బీసీ ఈ జనరల్ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టీ జనరల్ 1, ఎక్స్‌సర్వీస్‌మెన్ జనరల్ 1 పోస్టును కేటాయించారు.
భాషా పండితులు గ్రేడ్-2 ఉర్దూ పోస్టు 1 ఉండగా..దాన్ని వీహెచ్ మహిళకు కేటాయించారు.
భాషా పండితులు గ్రేడ్-2 హిందీ మొత్తం 12 - ఓసి జనరల్ 2, ఓసీ మహిళ 2, బీసీఎ జనరల్ 2, బీసీబీ జనరల్ 1, బీసీడీ జనరల్ 1, బీసీఈ జనరల్ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్టీ జనరల్ 1 పోస్టులు కేటాయించారు.
మున్సిపల్ పాఠశాలలకు 30 పోస్టులు:
జిల్లాలోని ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మొత్తం 30 పోస్టులు కేటాయించారు. వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 18, స్కూలు అసిస్టెంట్లు 6, భాషా పండితులు 5, పీఈటీ 1 పోస్టులను కేటాయించారు.
స్కూలు అసిస్టెంట్లు మొత్తం 6
గణితం 1, బయోలాజికల్ సైన్సు 2, సోషల్ స్టడీస్ 1, హిందీ 1, సంస్కృతం 1 పోస్టును ప్రకటించారు.
భాషా పండితులు గ్రేడ్-2 మొత్తం 5 పోస్టుల్లో తెలుగు 2, హిందీ 2, సంస్కృతం 1 పోస్టులు కేటాయించారు.