Teacher Professional
-
గురు దేవో భవ..
భారతీయ తల్లిదండ్రులు ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కోర్సుల కంటే ఉపాధ్యాయ వృత్తిపైనే అధిక ఆసక్తి కనబరుస్తున్నారు. 54 శాతం మంది తమ పిల్లలు బోధనా రంగంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తామంటున్నారు. వార్కే ఫౌండేషన్ 35 దేశాల్లోని 16– 64 వయస్కులౖ పె సర్వే జరిపింది. వార్కే రూపొందించిన అంతర్జాతీయ అధ్యాపక స్థితిగతుల సూచి– 2018 ప్రకారం.. పిల్లల్ని ఉపాధ్యాయులుగా చూడాలని కోరుకుంటున్న పెద్దలు మన దేశంలోనే ఎక్కువ. చైనా మన తర్వాత స్థానం (50శాతం)లో ఉంది. బ్రిటన్‌లో 23 శాతం మంది తల్లిదండ్రులు బోధనా రంగం వైపు వచ్చేలా తమ పిల్లలను ప్రోత్సహిస్తామంటున్నారు. ఇలా ఆలోచిస్తున్న పెద్దలు రష్యాలో అతి తక్కువ కేవలం 6శాతమే. టీచర్ల స్థితిగతుల సూచిలో 8వ స్థానం అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాల మెరుగు దలపై దృష్టి పెట్టి వార్కే ఫౌండేషన్ టీచర్ల పట్ల సమాజ ధోరణిపై సమగ్ర సర్వే జరిపి ఈ సూచి తయారు చేసింది. దీని ప్రకారం ఉపాధ్యాయ స్థితిగతుల సూచిలో చైనాకి మొదటి ర్యాంకు లభించగా, భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ చివరి స్థానంలో నిలవగా.. మలేసియా, తైవాన్ వరుసగా రెండు, మూడు స్థానాలు పొందాయి. అంతర్జాతీయంగా టీచర్ల ప్రతిపత్తి పెరుగుతున్నట్టు తాజా సర్వే తేల్చి చెప్పింది. ఐరోపా, పాశ్చాత్య దేశాల్లో కంటే ఆసియా దేశాలైన ఇండియా, చైనా, మలేసియా, తైవాన్, ఇండోనేసియా, కొరియాల్లో టీచర్లు మెరుగైన ప్రతిపత్తి కలిగి వున్నారని ఆ సూచి వెల్లడించింది. హెడ్ మాస్టర్.. ది గ్రేట్ ♦ విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తారంటున్న దేశాల్లో చైనా (81%) ముందుంది. ఉగాండా (79%), భారత్ (77%) రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. బ్రెజిల్ ఆఖరి స్థానం (9%)లో ఉంది. ♦ భారతీయులు పదికి 7.11 రేటింగ్ ఇవ్వడం ద్వారా మన విద్యా విధానం మెరుగైనదని (4వ స్థానం) ఇచ్చారు. ఫిన్లాండ్ (8) స్విట్జర్లాండ్ (7.2)) సింగపూర్ (7.1) పెద్దలు కూడా తమ విద్యావిధానాన్ని బాగానే విశ్వసిస్తున్నారు. ఈ విషయంలో ఈజిప్ట్ (3.8శాతం) ఆఖరి స్థానంలో నిలిచింది. ♦ డాక్టర్లు, హెడ్మాస్టర్లు, ప్రైమరీ, సెకండరీ టీచర్లు, నర్సులు సోషల్ వర్కర్లు, లైబ్రేరియన్లు తదితరæ 14 వృత్తి ఉద్యోగాల్లో హెడ్మాస్టర్లకు గౌరవపరంగా నాలుగో ర్యాంకు ఇస్తామని భారతీయులు చెప్పారు. ఈ విషయంలో మలేసియా, ఇండోనేసియా, చైనా మన కంటే ముందున్నాయి. మలేసియా, చైనాల్లో టీచర్లను డాక్టర్లతో పోల్చుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ♦ సెకండరీ స్కూలు టీచర్లకు మన వాళ్లు ఏడో ర్యాంకు ఇవ్వగా, చైనా వారికి మొదటి స్థానం కట్టబెట్టింది. వార్కే ఫౌండేషన్ 2013లో కూడా 21 దేశాల్లో సర్వే జరిపి ఇలాంటి సూచిని తయారు చేసింది. అప్పట్లో టీచర్లు ప్రతిపత్తిపరంగా దిగువ స్థానంలో ఉన్న దేశాలు ఈ ఐదేళ్లలో పుంజుకోవడాన్ని సర్వే నివేదిక ప్రస్తావించింది. కాగా, అసాధారణంగా పనిచేసిన టీచర్లను ప్రోత్సహించేందుకు వార్కే ఫౌండేషన్ గతంలో గ్లోబల్ టీచర్ ప్రైజ్ ప్రవేశపెట్టింది. -
కష్టానికి ఫలితం దక్కింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను...టీచర్ వృత్తి మానేసి 14 ఏళ్ల పాటు పార్టీలో సేవ చేశాను. పార్టీ ఏ పని అప్పజెప్పినా... ఎన్ని కష్టాలొచ్చినా స్పోర్టివ్‌గా తీసుకుని పనిచేశా. నా కష్టానికి ఫలితం లభించింది. కష్టపడితే విజయం తథ్యం అని నాకు నమ్మకం ఏర్పడింది... ఐ యామ్ సో హ్యాపీ..’ అంటున్నారు జిల్లా తొలి మహిళ, జడ్పీ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికయిన గడిపల్లి కవిత. తానేంటో పార్టీలోని అందరు నాయకులకు తెలుసని, తనకు మొదటి నుంచీ అండదండగా ఉన్న నాయకులను ఆదర్శంగా తీసుకుని జిల్లా అభివృద్ధికి కోసం కృషి చేస్తానని అంటున్నారు ఆమె. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా నుంచి కేబినెట్ హోదా పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన కవిత జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయిన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. విశేషాలివి... సాక్షి: జిల్లా తొలి మహిళగా, జడ్పీచైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బాధ్యతలు కూడా స్వీకరించారు... మీ అనుభూతి ఎలా ఉంది? జడ్పీ చైర్పర్సన్: తెలంగాణ రాష్ట్రంలోనే మా పార్టీ నుంచి తొలి జడ్పీచైర్మన్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. సహచర జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా ప్రజానీకం సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలోనికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా. సాక్షి: మంచి విద్యార్థిగా ఉన్నత చదువులు చదివారు... గృహిణిగా సమర్థ బాధ్యతలు నిర్వహించారు.. లెక్చరర్‌గా, టీచర్‌గా ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించారు.. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు....ఈ ప్రస్థానం మీకు ఎలా సాధ్యమైంది? జడ్పీ చైర్పర్సన్: నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. మా మామయ్య ట్రేడ్ యూనియన్ నాయకులు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ఉన్నా. నా భర్త నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మా కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. టీచర్ వృత్తి వదిలేసి పార్టీలో 14 ఏళ్లుగా పనిచేస్తున్నాను. గతంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. ఆ తర్వాత పార్టీలో అన్ని విషయాలు నేర్చుకున్నాను. లోటుపాట్లు తెలుసుకున్నాను. పార్టీ ఏ పని అప్పగించినా... ఎన్ని కష్టాలొచ్చినా స్పోర్టివ్‌గా తీసుకుని పనిచేశాను. మొదట్లో రాజకీయాలు కొంత ఇబ్బందిగా.. కష్టంగా అనిపించినా... ఆ తర్వాత అలవాటయిపోయింది... 14 ఏళ్ల అజ్ఞాతం తర్వాత పదవి వచ్చినట్టు ఫీలవుతున్నాను. నా కష్టానికి తగిన ఫలితం లభించింది... కష్టపడితే విజయం వచ్చి తీరుతుందన్న నమ్మకం కలిగింది. ఐ యామ్ సో హ్యాపీ. సాక్షి: చైర్పర్సన్ ఎన్నిక సమయంలో కొంత టెన్షన్‌గా కనిపించారు. ఎన్నిక కాగానే రిలాక్స్ ఫీలయినట్టున్నారు.. మళ్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు... మీరు సున్నిత మనస్కులని భావించవచ్చా..? జడ్పీ చైర్పర్సన్: అలా ఏమీ లేదండీ... నేనేమీ టెన్షన్ ఫీల్ కాలేదు. పార్టీలో నాయకులందరికీ నేనేంటో తెలుసు కాబట్టి... నన్నే చైర్పర్సన్ చేస్తారని అనుకున్నా. రిలాక్స్డ్గానే ఉన్నా... పార్టీకి చేసిన సేవకు మంచి గుర్తింపు ఉంటుందని భావించా... అయితే బాధ్యతల స్వీకరణ సమయంలో ఆనందాన్ని తట్టుకోలేక ఉద్వేగానికి లోనయి ఆనందభాష్పాలు రాల్చాను. సాక్షి: జిల్లా అభివృద్ధిలో మీ ప్రథమ ప్రాధాన్యాలేంటి? ఏయే అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తారు? జడ్పీ చైర్పర్సన్: విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే నా ప్రథమ ప్రాధాన్యత. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తా. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కనీసం రహదారి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల పక్షాన నిలబడతా. గిరిజన ఉపప్రణాళిక, ఐటీడీఏ నిధులతో ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తా.