టీచర్ బదిలీపై జెడ్పీటీసీ వీరంగం
డీఈవోతో వాగ్వాదం
రాజీనామా చేస్తానని బెదిరింపు
పాఠశాలకు తాళం వేస్తానని హెచ్చరిక
కరప :
తనకు చెప్పకుండా పాతర్లగడ్డ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలిని డెప్యుటేష¯ŒSపై అరట్లకట్ట హైస్కూల్‌కు బదిలీ చేయడంపై జెడ్పీటీసీ బుంగా సింహాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ చేసిన ఉపాధ్యాయురాలిని పాతర్లగడ్డ తీసుకురాకపోతే పాఠశాలకు తాళం వేస్తానని, తన సొంత గ్రామంలోనే విలువ లేనప్పుడు పదవెందుకు, జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు. ఉండాల్సిన పోస్టుల కంటే ఎక్కువ ఉన్నందునే డెప్యుటేష¯ŒSపై బదిలీ చేయాల్సి వచ్చిందని డీఈఓ ఆర్.నరసింహారావు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ ఆర్.నరసింహారావు బుధవారం సందర్శించారు. జెడ్పీటీసీ సింహాద్రి హైస్కూల్‌కు వచ్చి పాతర్లగడ్డలో ఉపాధ్యాయుల పనితీరు బాగుండటంలేదు. విద్యాబోధన బాగుండటంలేదని, విద్యార్ధులు వెనుకబడి పోతున్నారని, ఇదే విషయాన్ని ఎంఈఓ, ఇతర అధికారులకు చెప్పినా ఫలితం లేకపోగా తనకు చెప్పకుండానే తెలుగు ఉపాధ్యాయురాలు వీబీటీ సుందరిని అరట్లకట్ట హైస్కూల్‌కు బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అరట్లకట్ట హైస్కూల్లో 400 మంది విద్యార్థులున్నారని, అక్కడ తెలుగు టీచర్ లేక ఇబ్బందిగా ఉండటంతో పాతర్లగడ్డలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండటంతో డెప్యూటేష¯ŒSపై బదిలీ చేశానని డీఈఓ నరసింహా రావు బదులిచ్చారు. పాతర్లగడ్డ ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపరచి, విద్యాబోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అయినా సంతృప్తి చెందని జెడ్పీటీసీ మండలంలో ఎన్నో పాఠశాలలుండగా తమ పాఠశాల టీచర్‌ను బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.
డీఈఓ నరసింహారావుతో పాటు డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవానీ, ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు, ఎంపీడీఓ అన్నెపు ఆంజనేయులు, హెచ్ఎం పీవీఎ¯ŒS ప్రసాద్ తదితరులు జెడ్పీటీసీకి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోకుండా వెళ్లిపోయారు.