teachers trasfers go
-
ఉపాధ్యాయ బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జీవో 317తో ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి బదిలీ అయిన 25వేల మందిలో దాదాపు 15వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో సర్వీసు కలిపి రెండేళ్లు పూర్తయిన వారికి కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతివ్వాలని మంత్రి ఆదేశించారు. జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 59వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన కూడా పూర్తయిందని, ఈ ధరఖాస్తులు కూడా వచ్చిన తర్వాత అన్నింటిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. చదవండి: హైదరాబాద్కు మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి -
టీచర్ల బదిలీల జీఓ విడుదల చేయాలి
– యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాబురెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : అక్రమ బదిలీల కోసమే ప్రభుత్వం టీచర్ల సాధారణ బదిలీలను ఆలస్యం చేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి ఆరోపించారు. స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యా సంవత్సరానికి ఆటంకం కల్గకుండా వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ బదిలీలను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. సీసీఈ విధానంలో ఇంగ్లిషు, తెలుగు మీడియంలను పరిగణనలోకి తీసుకుని పోస్టులు సర్దుబాటు చేయాలన్నారు. అవసరమైతే కొత్త పోస్టులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఒకే సిలబస్, ఒకే పరీక్ష విధానం అనేది రాష్ట్రాల హక్కులు దెబ్బ తీయడమేనన్నారు. స్థానిక పరిస్థితులను గమనించకుండా డిటెన్షన్ విధానం అమలు చేయడం వల్ల డ్రాపౌట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం. సుధాకర్, ప్రధానకార్యదర్శి ఎస్వీవీ రమణయ్య, గౌరవాధ్యక్షులు నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.