అందరూ చదువుకోవాలి
చౌటుప్పల్, న్యూస్‌లైన్ : అందరూ చదువుకోవాలని.. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో మండలానికో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. చౌటుప్పల్ మండలం రెడ్డిబావిలోని క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ తరహాలో అన్ని రకాల హంగులతో మండలానికో పాఠశాలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తామన్నారు. ఈ విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. అందరూ చదువుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నందగిరి మహేశ్వరి, పోసాని నాగేశ్వర్రావు, పోసాని రాణి, ఎంఈఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏకే రెడ్డి, డీజీ రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, పెద్దిటి బుచ్చిరెడ్డి, శ్యామ్, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.