team of doctors
-
‘కథువా’ లైంగిక దాడి నిజమే: వైద్యులు
పఠాన్‌కోట్: ‘కథువా’ ఘటనలో బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యుల బృందం ధ్రువీకరించింది. బాధిత బాలిక ఊపిరాడకపోవడంతోనే చనిపోయినట్లు తేల్చింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆ వివరాలను చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఇటీవల వివరించారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా తెలిపారు. ఈ ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఓ బాలిక(8) సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి జరిగిందనీ, ఆమె ఊపిరాడకనే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. -
గుండె చికిత్సలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి గుండె ధమనులు రెండూ పూర్తిగా పూడుకుపోవడం, అలాగే గుండెలోని చెడు, మంచి రక్తాలను వేరుచేసే గోడకు రంధ్రం ఏర్పడటం వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏకకాలంలో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత నిమ్స్ మాజీ కార్డియాలజీ హెడ్, ఇండో–యూఎస్ సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగ ప్రస్తుత హెడ్ డాక్టర్ శేషగిరిరావుకు దక్కింది. ఇటువంటి సంక్లిష్టమైన చికిత్స చేసిన విషయంపై వైద్య చరిత్రను, జర్నల్స్‌ను పరిశీలించామని, కానీ ఆపరేషన్ విజయవంతమైన రికార్డు ఎక్కడా నమోదు కాలేదని శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం తమనే నివ్వెర పరుస్తోందన్నారు. పైగా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు శుక్రవారం డాక్టర్ శేషగిరిరావు విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం పట్టణానికి చెందిన 81 ఏళ్ల అనసూయమ్మకు గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకొని ఇండో–యూఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చారన్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసి చూడగా రెండు ధమనులు మొదట్లోనే పూడుకుపోయాయన్నారు. ఇలా రెండూ పూడుకుపోవడం వెయ్యిలో ఒకరిద్దరు రోగులకు మాత్రమే వస్తుందన్నారు. పైగా బీపీ స్థాయి 60కి పడిపోవడంతో తాము కంగారు పడ్డామన్నారు. మరోవైపు గుండె గోడలకు రంధ్రం ఏర్పడటంతో పరిస్థితి విషమించిందన్నారు. కానీ వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. సాధారణంగా కాలి నుంచి ఆపరేషన్ చేస్తామని, కానీ ఈ కేసులో మెడ రక్తనాళాల నుంచి గుండెకు పడిన రంధ్రాన్ని పూడ్చామన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గాంధీలో బాంబు పేలుడు
గాంధీ ఆస్పత్రి : గాంధీ కళాశాల ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగ్రింది. స్థానికులు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్యుల బృందం బాధితులకు వైద్యసాయం అందించింది. పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. వార్తల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించడంతో వివిధ చానళ్ల ప్రతినిధులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.... తూచ్.. ఇదంతా నిజమనుకుంటున్నారా..వట్టిదే.. బాంబు దాడుల్లో గాయపడిన క్షతగాత్రులకు తక్షణం ఎలాంటి వైద్యసేవలు అందించాలన్న అంశంపై గురువారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ‘బాంబు బ్లాస్ట్ మాక్ డ్రిల్’ లోని సన్నివేశాలివి.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐఐఈఎంఎస్) ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఎమర్జెన్సీ వైద్యంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. ఈ సందర్భంగా వైద్యులు వివిధ అం శాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ ఎమెర్జెన్సీ మెడిసిన్, ట్రామాకేర్లపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.