ఫాలోఆన్ లో చిక్కుకున్న టీమిండియా
సౌతాంప్టన్: ఇంగ్లండ్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ కు 40 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 323/8 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఏడుగురు పరుగులు మాత్రమే జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 243 పరుగులు వెనుకబడింది.
ఇంగ్లీషు బౌలర్ల ఆధిపత్యానికి టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని తలవంచాడు. అర్థ సెంచరీతో క్రీజులో ఉన్న కూల్ కెప్టెన్ ఒక్క పరుగు కూడా జోడించకుండానే వెనుదిరిగాడు. షమీ 5 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 5 వికెట్లు నేలకూల్చాడు. బ్రాడ్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తో ఫాలో ఆన్ ఆడించకుండా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది.