ముగిసిన పాలిసెట్ కౌన్సెలింగ్
► 8రోజుల్లో 3,353 మంది విద్యార్థుల
► ద్రువపత్రాల పరిశీలన
► 30వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
► 31న సవరణలు
మమహబూబ్‌నగర్ విద్యావిభాగం/వనపర్తిటౌన్: రాష్ట్ర సాంకేతిక ఉన్నత విద్యామండలి నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 20నుంచి మహబూబ్‌నగర్, వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన పాలిసెట్ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. ఉదయం 9గంటల నుంచి ఐదు గంటలకు వరకు చివరి ర్యాంకు వరకు చేపట్టిన కౌన్సెలింగ్‌లో 75 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్‌లో 3,353మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీ రూ. 250, బీసీ, ఓసీలు రూ. 500 చెల్లించారు. ఎస్సీ, ఎస్టీల ధృవపత్రాలను సాంఘిక సంక్షేమ శాఖ అథికారులు పరిశీలించారు. ఇదివరకు నిర్వహించిన ర్యాంకు కౌన్సెలింగ్‌లో హాజరు కాని విద్యార్థులకు సైతం కౌన్సెలింగ్‌కు హాజరైయ్యారు.
30 వరకు వెబ్ ఆప్షన్లు
కౌన్సెలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో, కోర్సుల ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 30న ముగియనుంది. ఈ లోపు విద్యార్థులు తమ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉందని సాలిసెట్ కన్వీనర్ రవికాంత్‌రెడ్డి తెలిపారు. వెబ్ ఆప్షన్ల్లో మార్పులు, చేర్పులకు ఈ నెల 31న అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.