Teej festival
-
#TeejFestival : ఆదిలాబాద్ : ఘనంగా తీజ్ సంబరాలు (ఫొటోలు)
-
‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది."నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్తీజ్ అంటే..పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.ఇంటింటి ఆశీస్సులు..పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.గోధుమ మొలకలు..తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు. శనగలకు రేగుముళ్లుతీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.నియమ నిష్టలతో..తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.ఏడవ రోజు ఢమోళీ.. ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.దేవతల ప్రతిరూపాలకు..ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.తొమ్మిదవ రోజు నిమజ్జనం..డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్‌ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ -
'సేవాలాల్ మహరాజ్.. దండి మేరమా'.. జ్ఞాపకంగా తీజ్ ఉత్సవం..!
మహబూబాబాద్: ఈ తీజ్ వేడుకల్లో మొదటి రోజు తండావాసులు గుమిగూడి తండా పెద్దమనిషి ఇంటి వద్ద సాయంత్రం వేళ గోధుమలు, శనగలు, నవధాన్యాలను నానబెడతారు. రెండో రోజు నాన బెట్టిన గోధుమలను చిన్న చిన్న బుట్టల్లో (దుస్సే రు తీగతో అల్లినవి) మట్టి, సేంద్రియ ఎరువు అలికిన తర్వాత పాటలు పాడుతూ బుట్టల్లో గోధుమలు విత్తుతారు. మూడో రోజు ఉదయం మంచె(ఢాక్లో) ఏర్పాటు చేసి గోధుమ చల్లిన బుట్టలను మంచెపై పెడతారు. అనంతరం పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులపాటు రోజూ పాటలు పాడుతూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీజ్ బుట్టల్లో నీరు పోస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు వీరి ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. ఉప్పు, కారం, మసాలాతో తయారు చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించరు. నియమ నిష్టలతో ఉంటూ ఆకు కూరలు, జొన్నరొట్టెలు తింటూ తీజ్‌ను (గోధు మ నారును) కాపాడుకుంటారు. తీజ్ పండుగను సేవాలాల్ మహరాజ్, దండి మేరమా దేవతనే జరిపిస్తుందని గిరిజనుల విశ్వాసం. ఏడో రోజు ఢమోళీ పూజ ఘనంగా జరుపుకుంటారు. తొక్కుడు పడని నల్లమట్టి తెచ్చి (అబ్బాయి, అమ్మాయి ప్రతిమలు) బొమ్మలు తయారు చేస్తారు. వీటిని గణగోర్ అని పిలుస్తారు. ఈ సందర్భంగా బియ్యం పిండితో చేసిన రొట్టెల్లో బెల్లం కలిపి నైవేద్యం (చూర్మో) తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో ప్రతి ఇంటికి వెళ్లి చూర్మో పంచుతూ నృత్యాలు చేస్తారు. రాత్రి సమయంలో అందరూ తీజ్ మంచె దగ్గర కలుసుకొని పాటలు పాడుతూ అమ్మాయిల చేత నెయ్యి, బెల్లం అన్నం కలిపి(దప్కార్) ఇస్తారు. చివరగా గణగోర్ బొమ్మలను తీజ్ వద్ద పెట్టి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు తీజ్ నిమజ్జ న కార్యక్రమంలో భాగంగా తండావాసులందరూ కలిసి సేవాలాల్ మహరాజ్‌కు బెల్లం అన్నం (కడవో) నైవేద్యంగా పెడతారు. మేరమా యాడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం వేళ మంచె ఢాక్లో పైనుంచి తీజ్ బుట్టలను అమ్మాయిలు తీసుకుని బాధాతప్త హృదయంతో తీజ్ తమను వదిలి వెళ్తోందని ఆటపాటలతో దగ్గరలోని కుంటలు, చెరువుల్లో బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. -
తీజ్ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య
జైనూర్ (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఆశేపల్లిలో జరిగిన తీజ్ వేడుకల్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు పండుగలో ఆనందంగా పాల్గొనగా ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆశేపల్లి గ్రామానికి చెందిన జాదవ్ మెఘాజీ(30) శనివారం రాత్రి కుటుంబ సభ్యులు తీజ్ సంబరాల్లో ఉండగా ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మెఘాజీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్ చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం -
ఘనంగా తీజ్ సంబరాలు
-
‘తీజ్ పండుగ’: ఉత్సాహంగా బంజారాల బతుకమ్మ వేడుకలు
ఆధునిక ప్రపంచంలోనూ తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు గిరిజనులు. ఏటా శ్రావణమాసంలో లంబాడా(బంజారా) తండాల్లో తొమ్మిది రోజులపాటు తీజ్ ఉత్సవాలు సందడిగా జరుగుతుంటాయి. ఈసారి తీజ్ ఉత్సవాలు రాఖీ పౌర్ణమి పండుగ రోజు(ఆదివారం) ప్రారంభమై శ్రీకృష్ణాష్టమితో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో తీజ్ వేడుకలపై సాక్షి కథనం... సాక్షి, ఉట్నూర్/బజార్హత్నూర్: పూర్వం సింధు రాజుల కాలం నుండి బంజారాల జీవన విధానంపై అనేక కథనాలు ఉన్నాయి అఖండ భారతావనిలో వందల ఏళ్ళ కాలం నుంచే బంజారాల పండుగలు ప్రత్యేకత కలిగివున్నాయి. బంజారాలు హిందూ రాజులైన పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ సింగ్ వంటివారి దగ్గర వివిధ హోదాల్లో సేవలందించారు. గోర్ బంజారాలు వారి కష్టం మీద వారే ఆధార పడుతూ స్వతంత్రంగా జీవించేవారు. నాడు ఏవిధంగానైతే భారతదేశంలో స్వయం పోషక గ్రామాలు వర్ధిల్లాయో, అదేవిధంగా గోర్ బంజారా ఆవాసాలు కూడా స్వయంపోషక తండాలుగా వర్ధిల్లాయి. బుట్టలపై నీళ్లు చల్లుతున్న యువతులు (ఫైల్) తొమ్మిది రోజులు ఆటపాటలతో.. బంజారాలు సంతానం, పాడి పంటల సౌభాగ్యం కోసం గోర్ దేవుళ్లయిన సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్, సీత్లా, మోరామ మాతలతో పాటు తిరుపతి బాలాజీ, హాతీరాం బావాజీ, వేములవాడ రాజన్నని కొలిచేవారు. బంజారాల పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి, ప్రకృతిని ఆరాధించేవే. ఒక్కో దేవత ఒక్కొక్క రకంగా తండాలను రక్షిస్తుందని నమ్ముతారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్‌లో నవధాన్యాలను, గోధుమ మొలకలను పూజించడం ఆనవాయితీ. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. సీత్లాభవాని పూజ ముగిసిన తర్వాత తీజ్‌ను జరుపుకొంటారు. పెళ్లి కాని యువతులకు పండుగ.. తీజ్ ఒక ప్రత్యేకమైన పండుగ. బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ అని చెప్పవచ్చు. బంజారాల సాంప్రదాయం ప్రకారం వివాహం కాని అమ్మాయిలు తండాలో ఎంత మంది ఉంటే అంతమంది తమ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచుతారు. యువతుల్లో ఒకరు తమ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు పూటలు నీరు పోస్తారు. ఈ నారు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని నమ్మకం. తీజ్ బుట్టలను పట్టుకొని తొమ్మిదో రోజున వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పుచప్పుళ్లతో బయలుదేరుతారు. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. వార్తా, రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో ఈ పండుగను ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు వారికి వీలైనప్పుడు నిర్వహించేవారు. కానీ చదువు, ఉద్యోగ, వ్యాపార పరంగా సొంత తండాలకు దూరంగా నివసిస్తున్న లంబాడీలు వారి పండుగలను ఒకే కాలంలో నిర్వహిస్తే వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పండుగను కలిసి నిర్వహించుకోవడమే కాకుండా, ప్రభుత్వ పరంగా గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని ఆశిస్తున్నారు. గోకులాష్టమితో నిమజ్జనం గోకులాష్టమి రోజున (తొమ్మిదోరోజు) గ్రామపెద్ద నాయక్ ఇంటి ఆవరణలో సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అనంతరం సమీపంలోని వాగులు, చెరువుల్లో వెదురుబుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో సోదరిమణుల ఆశీర్వారం సోదరులు తీసుకుంటారు. పులియాగెనో తప్పనిసరి.. తీజ్ ఉత్సవాల్లో ముఖ్యమైనది పులియాగెనో. దీనిని బంజారా మహిళలు అద్దాలు, గవ్వలు, పూసలతో చూడముచ్చటగా తయారు చేస్తారు. కలశం ద్వారా జలాలను యువతులు ఎత్తుకొచ్చేటప్పుడు తలపైన పెట్టుకునే దాన్ని గెనో, రెండు కలశాలపై కప్పుకుని వచ్చే దానిని పులియా అని వ్యవహరిస్తారు. వివాహ సమయంలో పులియాగెనోను తమ కుమార్తెకు తల్లిదండ్రులు బహుమానంగా అందిస్తారు. - బానోతు లక్ష్మీబాయి పరిశోధక విద్యార్థి (జర్నలిజం శాఖ). (బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ సందర్భంగా) -
కాజల్ ఇంట ‘హర్యాలీ తీజ్’వేడుక.. ఫోటోలు వైరల్
Kajal Aggarwal First Teej After Marriage Photos: పెళ్లైన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చే లోపు ఆ నూతన దంపతులు జరుపుకునే ప్రతి పండగ వారికి ప్రత్యేకమే.. ఓ మంచి జ్ఞాపకమే. ఇలాంటి బోలెడు జ్ఞాపకాలను పోగుచేసుకునే పనిలో ఉన్నారు కాజల్ అగర్వాల్. గత ఏడాది అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ ఆ వెంటనే సినిమాల షూటింగ్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పుడు కాస్త తీరిక దొరకడంతో ఫ్యామిలీకి టైమ్ కేటాయించారు. పైగా ఇది శ్రావణమాసం కావడంతో తమ దాంపత్య జీవితం బాగుండాలని ‘హర్యాలీ తీజ్’ (భర్త ఆయురారోగ్యాల కోసం పెళ్లయినవాళ్లు, మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు నార్త్‌లో జరుపుకునే పండగ) ఫెస్టివల్‌ను జరుపుకున్నారు. రోజంతా ఉపవాసం ఉన్నారు కాజల్. పండగ చేసుకున్న ఫొటోలను ‘ఫస్ట్ తీజ్.. హర్యాలీ తీజ్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు కాజల్. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఉమ’, ‘ఘోస్టీ’, ‘కరుంగాప్పియమ్’, ‘హే సినామిక’ షూటింగ్‌లను పూర్తి చేసిన ఆమె చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. -
తీజ్ పండుగకు ప్రభుత్వం చేయూత
చిట్యాల : బంజారులు ఏటా జరుపుకునే తీజ్ పండుగ నిర్వహణకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని శాసన lసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని ఒడితల గ్రామ శివారు పాశిగడ్డతండాలో గురువారం గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తీజ్ పండుగ గిరి జన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో తీజ్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటుందన్నారు. అనంతరం గిరిజన యువతులు తీజ్‌బుట్టలను తండా సమీపంలోని చెరువులు, బావుల్లో నిమజ్జనం చేశారు. కాగా, ఉత్సవాల్లో స్పీకర్ దరువేసి ప్రజలను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కాట్రేవుల సాయిలు, టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు సిరికొం డ ప్రశాంత్, మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, యూత్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తి సంపత్, జన్నె యుగేంధర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఓరంగంటి సధాకర్, నాయకులు శ్రీనివాసరావు, గణపతి, శంకర్, పాపిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఘనంగా గిరిజన పండుగ తీజ్