Tehrik-i-Taliban Pakistan
-
లష్కరే తోయిబా, టీటీపీలతో ముప్పు
వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా(ఎల్ఈటీ), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ల నుంచి తమ దేశానికి, తమ ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా పేర్కొంది. సిక్కు వేర్పాటువాద బబ్బర్ ఖల్సా కార్యకలాపాలతో మిత్రదేశాల్లోని అమెరికా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని అధ్యక్ష భవనం పేర్కొంది. ఎల్ఈటీ, టీటీపీతోపాటు ఐఎస్(ఇస్లామిక్ స్టేట్), అల్ కాయిదా, బోకో హరామ్, ఇంకా డజన్ల సంఖ్యలో ముస్లిం అతివాద గ్రూపుల వేర్పాటువాద, ఉగ్రవాద చర్యల వల్ల అమెరికా లోపల, వెలుపల అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది’ అని పేర్కొంది. -
గ్రెనేడ్ దాడి: పార్లమెంట్ సభ్యులకు గాయాలు
కరాచీ: పాకిస్థాన్ తీర నగరం కరాచీలో దుండగులు విసిరిన గ్రెనేడ్ దాడిలో దాదాపు 20 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురు పార్లమెంట్ సభ్యులు మహ్మద్ హుస్సేన్, షేక్ అబ్దుల్లా, సైఫుద్దీన్ ఖలీద్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నగరంలో ముత్తహిదా ఖ్వామి మూమ్మెంట్ (ఎంక్యూఎం) పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ క్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రెనేడ్ రష్యాలో తయారైందని ఫొరెన్సిక్ నిపుణులు నిర్థారించారని చెప్పారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తెహ్రిక్ -ఐ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించిందని పోలీసులు తెలిపారు. ఈ గ్రెనేడ్ దాడి శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.