వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ల నుంచి తమ దేశానికి, తమ ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా పేర్కొంది. సిక్కు వేర్పాటువాద బబ్బర్ ఖల్సా కార్యకలాపాలతో మిత్రదేశాల్లోని అమెరికా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని అధ్యక్ష భవనం పేర్కొంది. ఎల్‌ఈటీ, టీటీపీతోపాటు ఐఎస్(ఇస్లామిక్ స్టేట్), అల్ కాయిదా, బోకో హరామ్, ఇంకా డజన్ల సంఖ్యలో ముస్లిం అతివాద గ్రూపుల వేర్పాటువాద, ఉగ్రవాద చర్యల వల్ల అమెరికా లోపల, వెలుపల అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment