tejas thackeray
-
కొత్త రకం చేపను కనిపెట్టిన సీఎం తనయుడు!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ కనుమలు శాస్త్రవేత్తలు స్కిస్తురా జాతికి చెందిన కొత్తరకం చేపను కనుగొన్నారు. ఈ చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. చాలా చిన్న అందంగా, బంగారపు రంగులో పైన కొద్దిగా వెంట్రుకలు కలిగి చాలా చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇవి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండే మంచి నీటి చెరువులతోనే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. దీనిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తనయుడు తేజస్ థాక్రే, ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్ పోర్టుబ్లెయర్కు చెందిన జయసింహన్ ప్రవీణ్‌రాజ్, అండన్ వాటర్ ఫోటోగ్రాఫర్ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ కలిసి పశ్చిమ కనుమలలో కనుగొన్నారు. దీనికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని నామకరణం చేశారు. ఇది హిరణ్యాక్షి అనే నదిలో లభించడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వారు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో ప్రచురించారు. హిరణ్యాక్షి అంటే బంగారపు రంగు జుట్టు కలది అనే అర్థం కూడా వస్తుండటంతో ఈ పేరు చేపను వర్ణించడానికి కూడా సరిపోతుంది. ఇక ఈ చేపను తేజస్‌థాక్రే 2012లోనే కనుగొన్నారని ప్రవీణ్ రాజ్ తెలిపారు. దాని తరువాత 2017 లో ఈ జాతికి సంబంధించిన మరిన్ని చేపలను కనుగొన్నట్లు ప్రవీణ్ చెప్పారు. దీంతో దీని మీద మరింత రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన వివరాలను జర్నల్‌లో పొందుపర్చారు. చదవండి: నేను మోదీ హనుమాన్‌ని! -
తేజస్ ఠాక్రేకు యువసేన బాధ్యతలు?
సాక్షి ముంబై: ఠాక్రే కుటుంబం నుంచి వారసులు మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈసారి ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఠాక్రే కుటుంబానికి చెందిన మూడోతరం యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే.. వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగడం తెల్సిందే. మరోవైపు ఆదిత్య ఠాక్రే తమ్ముడు తేజస్ ఠాక్రే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఆయన స్థానంలో యువసేన అధ్యక్షుని బాధ్యతలను తేజస్ ఠాక్రేకు అప్పగించనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. సంగంనేర్, అహ్మద్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సభల్లో తన తండ్రి ఉద్ధవ్‌తో కలిసి తేజస్ ఠాక్రే పాల్గొన్నారు. అడవిలోనే ఉంటాడు: ఉద్ధవ్ తన చిన్న కుమారుడి రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఉద్ధవ్ ఠాక్రే తోసిపుచ్చారు. ఎన్నికల ర్యాలీలను చూసేందుకు మాత్రమే తేజస్ వచ్చాడని తెలిపారు. ఇంట్లో కంటే అడవిలోనే ఎక్కువగా గడుపుతుంటాడని వెల్లడించారు. తండ్రి, బీజేపీ నాయకులతో కలసి వేదిక పంచుకున్న తేజస్‌కు శివసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ‘ఎవరు వచ్చారు. శివసేన టైగర్ వచ్చాడు’ అంటూ నినాదాలు చేశారు. వన్యప్రాణి, జంతు ప్రేమికుడైన తేజస్.. అరుదైన పాములు, బల్లులు కనుగొనేందుకు పరిశోధనలు చేస్తుంటారు. (చదవండి: శివసేన కొంపముంచిన పొత్తు) -
పీతకు ఠాక్రే ఇంటి పేరు!
వాళ్లది మహారాష్ట్రలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబం. తాతగారి దగ్గర్నుంచి తండ్రి వరకు అంతా రాజకీయాల్లో ఆరితేరినవాళ్లే. రాష్ట్రాన్ని శాసిస్తున్నవాళ్లే. కానీ.. ఆ ఇంట్లో పుట్టిన పిల్లాడు మాత్రం తాను కొత్తగా కనుగొన్న ఓ జాతి పీతకు తమ ఇంటిపేరు పెట్టాడు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే (19)కి జంతువులంటే బాగా ఇష్టం. సింధుదుర్గ్ జిల్లాలోని సావంత్వాడి పట్టణంలో కనిపించే బుల్లి పీతలకు అతడు 'ఠాక్రే' అనేపేరు పెట్టాడు. పూర్తిపేరు 'గుబెర్నాటోరియానా ఠాకరాయి'. ఇంతకుముందు శివసేనకు సంబంధించిన మరాఠీ పేర్ల విషయాల్లో కొన్ని వివాదాలు వచ్చినా.. ఇందులో మాత్రం అలాంటిదేమీ లేదు. అడవులన్నా, వాటిలోని జీవజాలాలన్నా తేజస్‌కు బాగా ఇష్టం. గత సంవత్సరం కొంతమంది స్నేహితుల బృందంతో కలిసి కొంకణ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అరుదైన పాము జాతిని కనుక్కోవాలన్నది వాళ్ల ప్రయత్నం. కానీ, అతడికి రఘువీర్ ఘాట్స్ సమీపంలో ఐదు కొత్త జాతులకు చెందిన మంచినీటి పీతలు కనిపించాయి. దాంతో వాటన్నింటికీ పేర్లు పెట్టి, వాటి జాతి వివరాలను కూడా అంతర్జాతీయ సైన్స్ పత్రికలకు పంపగా.. వాటికి సంబంధించిన పరిశోధన పత్రం కూడా జూటాక్సా అనే పత్రికలో ప్రచురితమైంది.