‘కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి’
నాంపల్లి (హైదరాబాద్): ఆరోగ్య శ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆరోగ్య శ్రీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం సమావేశం ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా మందిరంలో జరిగింది.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... ప్రధాన సమస్యలైన కనీస వేతనం అమలు చేయాలని, థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి వైద్య ఆరోగ్య విభాగంలో భాగస్వాములను చేయాలని కోరారు. బస్పాస్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగుల బదిలీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.