శాంతి భద్రతలపై తెలంగాణ హామీ
కేంద్ర మంత్రి హరీభాయ్ చౌధురీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు కాపాడతామని టీ సర్కార్ హామీ ఇచ్చినందున 2014 జూన్ 4 నాటి మెమోరాండం అంశాన్ని అప్పటితోనే ముగించామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతేడాది జూలై 22న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్తీ భాయ్ చౌధురి తాజాగా జూన్ 16న లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆ లేఖను పాల్వాయి మంగళవారం మీడియాకు విడుదల చేశారు. గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలపై ఇచ్చిన మెమోరాండంను హోంశాఖ ఉపసంహరించుకుంటుందా అని పాల్వాయి వేసిన ప్రశ్నకు సమాధానంగా ఈ లేఖ ఇచ్చినట్లు చెప్పారు.