Telangana Bhavan Resident Commissioner
-
సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 'ఆపరేషన్ కావేరి' పేరుతో సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న భారతీయులను దశల వారిగా ఢిల్లీ, ముంబైలకు తరలించింది. ఇప్పటి వరకు సూమారు 160 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విదేశాంగ శాఖ సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల విషయమై అన్ని రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను అప్రమత్తం చేసింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ అంశంపై అధికారులతో సమీక్ష జరిపారు. దీని కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొత్తం నలుగురు తెలంగాణ వాసులు వస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వచ్చే వారికి ఇక్కడే వసతి, భోజనం ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపే ఏర్పాటు చేస్తున్నట్ల రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. అంతేగాదు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా అయితే తెలంగాణకు పంపామో అదే తరహాలో పంపించేలా.. ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. (చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు) -
ఢిల్లీ తెలంగాణ భవన్లో కరోనా కలకలం
సాక్షి, ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కోవిడ్ కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో ఒకరికి కరోనా వైరస్ పాటిజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ముగ్గురికి కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన రెసిడెంట్ కమిషనర్ డాక్టర్. గౌరవ్ ఉప్పల్ తెలంగాణ భవన్లో పలు నిషేధాజ్ఞలు విధించారు. (తెలంగాణలో కొత్తగా 1802 కేసులు 9 మరణాలు) -
బాధ్యతలు చేపట్టిన గౌరవ్ ఉప్పల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ నూతన రెసిడెంట్ కమిషనర్‌గా డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఆర్సీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు ఏఆర్సీ వేదాంతం గిరి, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా మూడేళ్లపాటు విధులు నిర్వర్తించిన గౌరవ్ ఉప్పల్‌ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. గౌరవ్ 2005 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. -
టీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అజయ్‌మిశ్రా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే మూడు కీలక శాఖలను నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రాకు ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది. ఢిల్లీలోని తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)ను ఇస్తూ ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అజయ్ మిశ్రా ఇప్పటికే జీఏడీ(పొలిటికల్), హోం, రోడ్లు, భవనాల శాఖల ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక పౌర సరఫరాల సంస్థ ఎండీగా ఉన్న వి.అనిల్‌కుమార్‌కు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ఇంకా కాకపోవడంతో.. అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయించక తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.