
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ నూతన రెసిడెంట్ కమిషనర్‌గా డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఆర్సీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు ఏఆర్సీ వేదాంతం గిరి, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా మూడేళ్లపాటు విధులు నిర్వర్తించిన గౌరవ్ ఉప్పల్‌ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. గౌరవ్ 2005 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment