gourav uppal
-
బాధ్యతలు చేపట్టిన గౌరవ్ ఉప్పల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ నూతన రెసిడెంట్ కమిషనర్‌గా డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఆర్సీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు ఏఆర్సీ వేదాంతం గిరి, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా మూడేళ్లపాటు విధులు నిర్వర్తించిన గౌరవ్ ఉప్పల్‌ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది. గౌరవ్ 2005 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. -
పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
సాక్షి, నల్లగొండ : పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంతోపాటు పటిష్టమైన ఏర్పా ట్లు చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ధనంజయ్ దేవాంగన్, పోలీస్ పరిశీలకుడు లిరోమో జోపె సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు అమయ్‌కుమార్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీలు వెంకటేశ్వర్లు, ఏవీ రంగనాథ్, ఏఎస్పీ ప ద్మనాభరెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్యలతో సమావేశాన్ని నిర్వహించారు. నల్లగొం డ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేం దుకు చేపట్టిన చర్యలు, తీసుకోబోతున్న విధివిధానాలపై కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలకులకు వెల్లడించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు కేంద్ర పోలీస్ బలగాలను ఉపయోగించి మరింత భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత భద్రతను పెంచామని, గ్రామాల్లో జరుగుతున్న అన్నిరకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నామని తెలిపారు. ఘర్షణకు ప్రేరేపించేవారిని బైండోవర్ చేస్తున్నామని, ఎక్సైజ్ అధికారులతో కలిసి బెల్ట్ షాపులను నిరోధించేందుకు తనిఖీలు చేస్తున్నామని, మద్యం, డబ్బు రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించామని ఓటింగ్ శాతం పెరిగే విధంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎన్నికల నిబంధనల మేరకు ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పరిశీలకులు ధనంజయ్ దేవాంగన్, లిరోమో జోపెలు సూచించారు. ఎన్నికల విధుల్లోకి ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, మాజీ సైనికులు పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగినవారు సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వలంటీర్లు రమేశ్ ఫోన్ నెం. 8186025800ను, మాజీ సైనికులు సైనిక సంక్షేమ అధికారి నరేందర్‌రెడ్డి 9966170084 నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ కోరారు. -
సమన్వయంతో ప్రగతి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాల విభజన తర్వాత ఏడాదిలో అన్ని రంగాల్లో .. అన్నిశాఖల సమన్వయంతో ప్రగతి సాధించామని, పలు సంక్షేమ పథకాల్లో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని.. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా నిర్దేశించిన టార్గెట్లు పూర్తిచేస్తామని కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. జిల్లా విభజన జరిగి ఏడాది అయిన సందర్భంగా ఆయన బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రగతిని వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఇప్పటివరకు 105 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయితే.. 40 గ్రామాల్లో ఎలాంటి తప్పులు లేకుండా రికార్డులు సిద్ధమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ బృందాల పనితీరు ప్రశంసనీయమని, రైతుల సహకారం అభినందనీయమని కొనియాడారు. ప్రక్షాళన కార్యక్రమంతా మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గొర్రెల పంపిణీలో రాష్ట్రంలో.. జిల్లా రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు 7,368 యూనిట్లు పంపిణీ చేశామని, రీసైక్లింగ్ చేయవద్దంటూ పోలీసులు, సీనియర్ అధికారుల బృందాలతో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం 9 శాతం మాత్రమే ఉందని, ఈ ఏడాది 1.75 కోట్ల మొక్కలను హరితహారం కింద నాటామన్నారు. ఈ ఏడాది 2 వేల డబుల్‌బెడ్ రూం ఇళ్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, ఇప్పటివరకు 600 పైగా ఇళ్లకు పునాదులు పడ్డాయని పేర్కొన్నారు. గతంలో నిర్మించిన 15 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. పత్తి రాష్ట్రంలోనే ఎక్కువగా మన దగ్గర సాగు చేశారని, 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం వేగవంతంగా నడుస్తుందని, 1,700 ఆవాసాలకు మంచినీళ్లు అందించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అమృత్ పథకంతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు రూ.150 కోట్లు వచ్చాయని, దేవరకొండకు రూ 40 కోట్లు మంజూరైతే ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. డిండి ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి ఇస్తున్నామన్నారు. అదుపులో శాంతిభద్రతలు ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. జిల్లా అంతటా 510 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇంకా అవసరమున్న పట్టణాల్లో త్వరలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 15 షీంటీలు ఉన్నాయని, 48 గ్రామాలను పోలీస్ శాఖ దత్తత తీసుకొని సామాజిక దురాచారాలపై అవగాహన కల్పిస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా జరుగుతుందన్నారు. డిండి ప్రాజెక్టు భూ సేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎఫ్ఓ శాంతారాం పాల్గొన్నారు. -
త్వరితగతిన ‘జన్మభూమి’ డేటా ఎంట్రీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జన్మభూమి కార్యక్రమంలో స్వీకరించిన అభ్యర్థనల డేటా ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమ డేటా ఎంట్రీ, తుపాను అప్రమత్తతపై అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అత్యవసర సేవలు అందాల్సిన (హైరిస్క్) మహిళలు, పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ సంయుక్తంగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరు జాబితాలో తప్పిపోరాదని సూచించారు. తుపానుపై అప్రమత్తం తుపానుపై జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అధికారులు స్థానికంగా ఉండి అన్ని ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, డ్వామా పీడీ ఎ. కల్యాణ చక్రవర్తి, జెడ్పీ సీఈవో ఎం.శివరామనాయకర్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్ గీతాంజలి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఆర్. గణపతిరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఆర్.రవీంద్రనాథ్, పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు పి.నాగన్న పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’లో తిరుగుబాటు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖలో ముసలం ప్రారంభమైంది. ఉన్నతాధికారి, కిందిస్థారుు సిబ్బంది మధ్య కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారస్థారుుకి చేరింది. రెవెన్యూ శాఖ కార్యకలాపాలకు సంబంధించి జారుుంట్ కలెక్టర్ తీసుకువస్తున్న ఒత్తిళ్లతో ఆ శాఖలో తిరుగుబాటు చోటు చేసుకుంది. అవసరమైన సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించకుండానే నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేయాలని ఆదేశించడం.. సకాలంలో చేయలేనివారిపై చర్యలు తీసుకోవడం, మరికొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడటం, హెచ్చరికలు జారీ చేయడంతో సిబ్బంది మనస్తాపానికి గురవుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల పైనే కాకుండా రేషన్ డీలర్లు, గ్రామ రెవెన్యూ ఆదికారులు సైతం జేసీ జి.వీరపాండ్యన్ వైఖరితో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. రెవెన్యూ సంబంధమైన అన్ని వర్గాల నుంచీ ఆయన తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా శుక్రవారం జేసీ నిర్వహించిన ఒక సమావేశాన్ని మొత్తం తహశీల్దార్లందరూ బహిష్కరించడంతో ఈ అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరింది. జేసీ తీరుకు వ్యతిరేకంగా తొలుత ఈ నెల మొదటి వారంలో రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు కచ్చితంగా రేషన్ షాప్‌లో నిర్వహించాలని, స్టాక్ రిజిస్టర్ నిరంతరం ఒకటే ఉండేలా కొత్త విధానం తీసుకురావడంతోపా టు అన్ని డీపోల్లోనూ 95 శాతానికి తక్కువ లేకుండా ఆధార్ అనుసంధానం చేయాలని ఆదే శించారు. సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో డీలర్లు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని జేసీకి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసి జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారికి ఆధార్ అనుసంధానానికి గడువు పెంచారు. ఇటీవల రాజాం మండలంలో జమాబందీ కార్యక్రమంలో భాగంగా ఆడంగల్ పూర్తి చేయలేదంటూ 17 మంది గ్రామ రెవెన్యూ ఆధికారులకు జేసీ చార్జిమెమోలు ఇచ్చారు. తమకు కొంత సమయం ఇవ్వమని వారు కోరినా పట్టించుకోలేదు. దీంతో వీఆర్ఏల సంఘ సభ్యులు శ్రీకాకుళంలో అత్యవసర సమావేశం నిర్వహించి జేసీ తీరుపై నిరసన తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కంప్యూటర్లు, ఆపరేటర్లు, నెట్ సదుపాయం, నిరంతర విద్యుత్ తదితర సమస్యలు ఉన్నాయని అడంగల్ ఆధునీకరణకు సమయం కావాలని కోరారు. సౌకర్యాలు కల్పించకుండా తమ పీక మీద కత్తి పెట్టడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా శుక్రవారం కలెక్టరేట్లో జరగాల్సిన ఒక సమీక్ష సమవేశాన్ని తహశీల్దార్లు బహిష్కరించారు. తమకు వసతులు కల్పించి పని ఒత్తిడి తీసుకురావాలని జేసీని కోరారు. తహశీల్దార్లకు సుమారు 50 రకాల విధులు ఉన్నాయని, వీటిలో ఏ ఒక్క విషయంలో వెనుకబడినా చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించడంతో తహశీల్దార్లు అందోళనకు దిగారు. దీంతో సమావేశం జరలేదు. దీనిపై జేసీ, డీఆర్వో తహశీల్దార్లతో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. ప్రభుత్వ నిర్ణయాలనే అమలు చేస్తున్నా:జేసీ ఈ అంశాలను జేసీ వీరపాండ్యన్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వం ఆదే శాల మేరకే ఒత్తిడి తేవాల్సి వస్తోందన్నారు. ఆధార్ సీడింగ్ తప్పని సరిగా చేయాలన్న ఒత్తిడి తనపైనా ఉందన్నారు. రెవెన్యూలో పనిచేస్తున్న ఉద్యోగులు తన ఉద్యోగులని, వారి బాగోగులు చూడటం తన బాధ్యత అన్నారు. అంతే తప్ప వారిపై ఎటువంటి కోపం లేదని స్పష్టం చేశారు. వసతుల కల్పనకు ప్రయత్నిస్తామన్నారు. తహశీల్దార్ల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తానన్నారు.