ఎస్పీ రంగనాథ్, కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్‌తో కలిసి సమీక్షిస్తున్న ఎన్నికల పరిశీలకులు
సాక్షి, నల్లగొండ : పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంతోపాటు పటిష్టమైన ఏర్పా ట్లు చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ధనంజయ్ దేవాంగన్, పోలీస్ పరిశీలకుడు లిరోమో జోపె సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు అమయ్‌కుమార్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీలు వెంకటేశ్వర్లు, ఏవీ రంగనాథ్, ఏఎస్పీ ప ద్మనాభరెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్యలతో సమావేశాన్ని నిర్వహించారు. నల్లగొం డ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.
ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేం దుకు చేపట్టిన చర్యలు, తీసుకోబోతున్న విధివిధానాలపై కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలకులకు వెల్లడించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు కేంద్ర పోలీస్ బలగాలను ఉపయోగించి మరింత భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత భద్రతను పెంచామని, గ్రామాల్లో జరుగుతున్న అన్నిరకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నామని తెలిపారు. ఘర్షణకు ప్రేరేపించేవారిని బైండోవర్ చేస్తున్నామని, ఎక్సైజ్ అధికారులతో కలిసి బెల్ట్ షాపులను నిరోధించేందుకు తనిఖీలు చేస్తున్నామని, మద్యం, డబ్బు రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీలు వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించామని ఓటింగ్ శాతం పెరిగే విధంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎన్నికల నిబంధనల మేరకు ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పరిశీలకులు ధనంజయ్ దేవాంగన్, లిరోమో జోపెలు సూచించారు.
ఎన్నికల విధుల్లోకి ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, మాజీ సైనికులు
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగినవారు సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వలంటీర్లు రమేశ్ ఫోన్ నెం. 8186025800ను, మాజీ సైనికులు సైనిక సంక్షేమ అధికారి నరేందర్‌రెడ్డి 9966170084 నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment